కెనోలా ఆయిల్‌తో ఎంత లూస్‌ అయిన పొట్టను అయినా తగ్గించేయొచ్చు.!!

బాన పొట్ట‌ను, ఊబ‌కాయాన్ని త‌గ్గించ‌కోవ‌డం canola oil తో సాధ్య‌మ‌వుతుంద‌ని నిపుణులు అంటున్నారు.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా బాన పొట్ట స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.

కెనోలా ఆయిల్‌తో ఎంత లూస్‌ అయిన పొట్టను అయినా తగ్గించేయొచ్చు.!!
canola oil for belly fat


ఊబకాయం.. నేడు పదిమందిలో ఆరుగురికి ఉంటుంది. లైఫ్‌స్టైల్ ఛేంజెస్‌ వల్ల ఏది పడితే అది తిని.. ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వల్ల అమాంతం బరువు పెరుగుతారు.. బరువు పెరుగుతున్నారని తెలిసి కూడా చాలామంది మొదట్లో లైట్‌ తీసుుకంటారు.. కొంతకాలనికి వారి శరీరం మీద వారికే చిరాకు వస్తుంది. సన్నగా, నాజుకుగా అవ్వాలని అప్పుడు అనిపిస్తుంది. ఇక అప్పుడు స్టాట్‌ చేస్తారు.. పొట్ట ఎలా తగ్గించుకోవాలి, తొడల్లో కొవ్వు ఎలా కరిగించుకోవాలి అని నెట్‌లో సర్చ్‌ చేస్తుంటారు. ఊబ‌కాయం కార‌ణంగా హార్ట్ ఎటాక్, అధిక ర‌క్తపోటు, డ‌యాబెటిస్, క్యాన్సర్ వంటి జ‌బ్బుల బారిన ప‌డి ఆక‌స్మిక మ‌ర‌ణానికి గురి అవుతున్నారు. ఊబ‌కాయాన్ని, బాన‌ పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం పెద్ద సమస్య ఏం కాదు..ఇలా చేయడం వల్ల మీ పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు..

బాన పొట్ట‌ను, ఊబ‌కాయాన్ని త‌గ్గించ‌కోవ‌డం canola oil తో సాధ్య‌మ‌వుతుంద‌ని నిపుణులు అంటున్నారు.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా బాన పొట్ట స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. కింద కూర్చోవ‌డానికి వీలు లేకుండా పొట్ట ఇబ్బంది పెడుతుంది. ఈ పొట్ట కార‌ణంగా అనేక ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. వ‌రుస‌గా నాలుగు వారాల పాటు కెనోలా ఆయిల్‌ను వాడితే ఎలాంటి పొట్టైనా ఇట్టే క‌రిగిపోతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆయిల్స్‌లో కెనోలా ఆయిల్ ఒక‌టి. ఈ ఆయిల్‌ను కెనోలా సీడ్స్ నుంచి తయారు చేస్తారు. వీటిలో శాచురేటేడ్ ఫ్యాట్స్ త‌క్కువ‌గా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తాయి. ఈ ఆయిల్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అల్ఫా లినోలిక్ యాసిడ్ ఎఎల్ఎలు అధికంగా ఉంటాయి. ఈ ఎఎల్ఎలు గుండె సంబంధిత జబ్బుల‌ను, కొలెస్ట్రాల్, ర‌క్త‌పోటుతోపాటు కడుపులోనూ, గుండెలోనూ వ‌చ్చే మంట‌ల‌ను త‌గ్గిస్తాయని వైద్యులు అంటున్నారు.. ఈ ఆయిల్‌ను వాడిన వారిలో పొట్ట త‌గ్గింద‌ని అధ్యయనాల ద్వారా తెలిసింది.. కెనోలా ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల బాన పొట్ట‌తో పాటు ఊబకాయాన్ని కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే ట్రై చేయండి..! ఆన్‌లైన్‌ మార్కెట్‌లో దొరకనిది అంటూ ఉండదు..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.