Kidney stones : కిడ్నీలో రాళ్లున్నాయా..... తస్మాత్ జాగ్రత్త 

శరీరంలో kidney stones సమస్యతో వచ్చే బాధ భరించలేనిది. ఆ సమస్యను తొలిదశలోనే గుర్తించడం మంచిది. యూరిన్‌ వెళ్లాలంటే మంటగా అనిపిస్తుంది. కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు.

Kidney stones : కిడ్నీలో రాళ్లున్నాయా..... తస్మాత్ జాగ్రత్త 
Beware of kidney stones


kidneys : ఏ అవయానికి సమస్య వచ్చినా......దాని ప్రభావం కచ్చితంగా శరీరంపై ఉంటుంది. అయితే  
ముఖ్యమైన అవయవాల్లో kidneys ఒకటి. శరీరంలో వ్యర్థపదార్థాలను  బయటకు పంపడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. నేటి ఆధునిక సమాజంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య బాగా పెరిగింది.

శరీరంలో కిడ్నీ రాళ్ల సమస్యతో వచ్చే బాధ భరించలేనిది. ఆ సమస్యను తొలిదశలోనే గుర్తించడం మంచిది. యూరిన్‌ వెళ్లాలంటే మంటగా అనిపిస్తుంది. కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు. ఒకవేళ కిడ్నీలో రాళ్లు పెద్దగా ఉంటే శస్త్రచికిత్స చేసి తీస్తారు. సరైన సమయానికి మంచి వైద్యం తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

కిడ్నీలో రాళ్ల కారణంగా నడుమునొప్పి, కడుపునొప్పిగా ఉంటుంది. రాయి మూత్రనాళంలో అడ్డుపడి కిడ్నీకి ఒత్తిడి పెంచడం వల్ల సడన్ గా నొప్పి వచ్చేస్తుంది. పెద్ద పెద్ద రాళ్లు ఉంటే ఆ నొప్పి మరింతగా ఉంటుంది. సమస్యను ముందే గుర్తించకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సైతం దారి తీయవచ్చు.

కిడ్నీలో రాళ్ల సమస్య ఉండేవారిలో మూత్రంలో రక్తం కనిపించడం. రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటే మూత్రం వాసన రాదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే దుర్వాసనగా ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఎలా వస్తాయి?

కిడ్నీలో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి. కాల్షియం అక్సినేట్‌, కాల్షియం ఫాస్పేట్‌. సాలిడ్‌ కంపోనెంట్‌లు మూత్రంలో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న గుళికలుగా మారుతాయి. మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల తలెత్తే స్పటికాలు కిడ్నీలో రాళ్లకు దారితీస్తాయి.

అధిక బరువు ఉన్నా కిడ్నీలో రాళ్లు వస్తాయి, డయాబెటిస్‌, వ్యాయామం చేయకపోయినా, నీళ్లు సరైనా మోతాదులో తాగకపోయినా, మాంసాహారం అధికంగా తిన్నా రాళ్లు ఏర్పడతాయి, నిద్రలేమి, శరీరంలో విటమిన్‌ బి6, సి లోపం వల్ల
విటమిన్‌ డి అధికంగా ఉన్నా, కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడవచ్చు.
కిడ్నీలో రాళ్లు చిన్నగా ఉంటే మూత్ర నాళానికి చేరాక నొప్పి, ఆ రోగం లక్షణాలు భయటపడతాయి

కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు

  • పాలకూర ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు.
  • గుమ్మడి, క్యాలీఫ్లవర్, టమోటా తినకూడదు.
  • సపోట పళ్లు, పుట్టగొడుగులు వాటికి దూరంగా ఉండాలి.
  • ఉసిరి, దోసకాయ, వంకాయ, క్యాబేజీలను అతిగా తినకూడదు.
  • మటన్, చికెన్లను బాగా తగ్గించాలి.

కిడ్నీలో రాళ్లు ఉంటే తినాల్సినవి

  • దానిమ్మ, బత్తాయి, పైనాపిల్, అరటి తినొచ్చు.
  • బాదం, బార్లీ, మొక్కజొన్నలు, ఉలవలు తీసుకోవచ్చు.
  • క్యారెట్లు, కాకరకాయ, నిమ్మకాయ, చేపలనను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.