White spots : ముఖంపై తెల్ల మచ్చలు ఉన్నాయా.. ఇలా చేయండి...!!

దుమ్మూ, ధూళి వల్ల..ఫేస్‌ పాడైపోతుంది. మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి . వీటిని  White spots  అంటారు

White spots  : ముఖంపై తెల్ల మచ్చలు ఉన్నాయా.. ఇలా చేయండి...!!
White spot on face


చర్మంపై చాలామందికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొన్ని సమస్యలకు అయితే కారణాలు కూడా తెలియవు.. దుమ్మూ, ధూళి వల్ల..ఫేస్‌ పాడైపోతుంది. మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటిని  White spots  అంటారు. ఇవి చిన్న పిల్ల‌ల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. చ‌ర్మం కింది భాగంలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ఈ పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. చ‌ర్మానికి సంబంధించిన‌ లేజర్ చికిత్స‌లు తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ క‌లిగిన లేప‌నాలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల‌, చ‌ర్మానికి సూర్య‌ర‌శ్మి ఎక్కువగా తగిలిన‌ప్పుడు కెరాటిన్ దెబ్బ తిని పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. వీటిని ఇంటి చిట్కాల ద్వారా ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల మ‌చ్చల‌ను త‌గ్గించ‌డానికి ఓట్స్‌ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌ను నీటితో క‌లిపి మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పాల మచ్చ‌లు ఉన్న చోట రాసి అరగంట త‌రువాత క‌డిగి వేయాలి. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చలు త‌గ్గుతాయి.

తేనె వ‌ల్ల పాల మ‌చ్చ‌లు తగ్గ‌డంతోపాటు చ‌ర్మానికి ఎంతో మేలు క‌లుగుతుంది. స‌హ‌జ సిద్ద‌మైన తేనెను పాల మ‌చ్చ‌లు ఉన్న చోట రాసి 20 నిమిషాల త‌రువాత వేడి నీటితో క‌డిగి వేయాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎక్కువ‌గా ఉంటుంది.

పాల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే వాటిల్లో ట‌మాటాలు ఒక‌టి. ఒక ట‌మాటాను తీసుకుని స‌గానికి కట్ చేసి పాల మ‌చ్చ‌ల‌పై నేరుగా రుద్దాలి. 20 నిమిషాల త‌రువాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చ‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఆముదం నూనె వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌యాలు క‌లుగుతాయి. జుట్టు పెరుగుద‌ల‌కు కూడా ఆముదం వాడతారు.. పాల మ‌చ్చ‌లను త‌గ్గించ‌డానికి కూడా ఆముదం నూనెను వాడుతారు. ఒక టీ స్పూన్ చొప్పున ఆముదం నూనెను, ఆలివ్ నూనెను క‌లిపి నేరుగా పాల మ‌చ్చ‌లపై రాసి 10-20 నిమిషాల త‌రువాత వేడి నీటితో క‌డిగేయాలి. దీంతో సమస్య తగ్గుతుంది.

నీటి ఆవిరితో చాలా సుల‌భంగా పాల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించవ‌చ్చు. ఒక పాత్ర‌లో నీటిని బాగా వేడి చేసి ఆ నీటిని వెడ‌ల్పాటి పాత్ర‌లో తీసుకోవాలి. ఇప్పుడు ముఖానికి ఆవిరి త‌గిలేలా కూర్చొని దుప్ప‌టితో మూసివేయాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

నిమ్మ‌కాయ ర‌సంలో ఒక టీ స్పూన్ చ‌క్కెర వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాల మ‌చ్చ‌ల‌పై వృత్తాకారంలో ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయండి. 15 నిమిషాల త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చ‌లు వేగంగా త‌గ్గుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.