Insomnia : నిద్రలేమి సమస్యకు మెగ్నీషియం లోపం కూడా ఒక కారణమే తెలుసా..?

Insomnia  : రాష్ట్రం, దేశంతో సంబంధం లేకుండా..ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అందరూ అనుభవించే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య 5 నుంచి 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక మొత్తం అమెరికా జ‌నాభాలో 7..

Insomnia : నిద్రలేమి సమస్యకు మెగ్నీషియం లోపం కూడా ఒక కారణమే తెలుసా..?


Insomnia  : రాష్ట్రం, దేశంతో సంబంధం లేకుండా..ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అందరూ అనుభవించే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య 5 నుంచి 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక మొత్తం అమెరికా జ‌నాభాలో 7 నుంచి 19 శాతం మంది నిత్యం త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలా మందికి గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు రాకముందే స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. నిద్రలేమి సమస్యను తగ్గించుకోవడానికి మెగ్నిషియం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. చాలా మంది నిజానికి ఈ పోష‌క ప‌దార్థం గురించి అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ మెగ్నిషియం ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే.. దాంతో నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

డ‌యాబెటిస్‌, పాంక్రియాటైటిస్‌, హైప‌ర్ థైరాయిడిజం, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైన‌ల్ వ్యాధులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ త‌దిత‌ర వ్యాధులు ఉన్న‌వారిలో స‌హ‌జంగానే మెగ్నిషియం లోపం వ‌స్తుంటుంది. అలాగే ఆల్క‌హాల్‌, సోడా, కాఫీ వంటి డ్రింక్స్‌ను ఎక్కువ‌గా తీసుకున్నా మెగ్నిషియం లోపిస్తుంది. దీంతోపాటు డై యురెటిక్స్ తీసుకునేవారు, రుతుస్రావం తీవ్రంగా అయ్యే మ‌హిళ‌లు, తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌య్యేవారు, చెమ‌ట బాగా ప‌ట్టేవారికి కూడా మెగ్నిషియం తగ్గుతుంది.. క‌నుక ఎవ‌రైనా ఈ విభాగాల‌కు చెందిన వారు ఉంటే మెగ్నిషియం లోపం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి.

రోజుకు ఎవ‌రికి, ఎంత మెగ్నిషియం అవ‌స‌రం..?

పురుషుల‌కు – 400 – 420 మిల్లీగ్రాములు
మ‌హిళ‌లకు – 310 – 320 మిల్లీగ్రాములు

మార్కెట్‌లో మ‌న‌కు మెగ్నిషియం స‌ప్లిమెంట్లు కూడా ల‌భిస్తాయి. అయితే వాటిని మోతాదుకు మించి తీసుకోకూడదు. వికారం, క‌డుపులో నొప్పి, డ‌యేరియా వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతోపాటు కొన్ని స‌మ‌యాల్లో అసాధార‌ణ రీతిలో గుండె కొట్టుకోవ‌డం, కార్డియాక్ అరెస్ట్ కూడా సంభ‌వించి ప్రాణాలకే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్త్రీ, పురుషులు ఎవ‌రైనా స‌రే.. నిత్యం 350 మిల్లీగ్రాముల మోతాదులో మెగ్నిషియం అందేలా చూసుకుంటే.. ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

ఏ ఆహారాల్లో మెగ్నిషియం ఎక్కువ‌గా ఉంటుంది ?

అవ‌కాడోలు, అర‌టిపండ్లు, పాల‌కూర‌, జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, బీన్స్‌, ప‌ప్పు దినుసులు, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, పాలు, పెరుగు, సోయా పిండి, ఇత‌ర న‌ట్స్‌, బ్రౌన్ రైస్‌, తృణ ధాన్యాలు, విత్త‌నాలు, సోయా ఉత్ప‌త్తులలో మెగ్నిషియం ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా మెగ్నిషియం లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.