రక్తనాళ్లాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా ఉండాలంటే ఉల్లితో ఇలా చేయండి..!

మన ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువు.. కొలెస్ట్రాల్. ఇది మనిషిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈరోజుల్లో చాలా మంది ఈ కొలెస్ట్రాల్‌ ఎక్కువై.. అది కరిగించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేడు అర్ధంతరంగా వచ్చే హార్ట్‌ ఎటాక్‌లకు కారణం కూడా

రక్తనాళ్లాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా ఉండాలంటే ఉల్లితో ఇలా చేయండి..!


మన ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువు.. కొలెస్ట్రాల్. ఇది మనిషిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈరోజుల్లో చాలా మంది ఈ కొలెస్ట్రాల్‌ ఎక్కువై.. అది కరిగించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేడు అర్ధంతరంగా వచ్చే హార్ట్‌ ఎటాక్‌లకు కారణం కూడా ఈ కొలెస్ట్రాలే. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఇలా ప్రాణాంత‌క ప‌రిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అందుకు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద చెప్పిన చిట్కాను పాటించ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం నిత్యం ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వాడుతుంటాం. ఉల్లిపాయ‌లు వేయ‌కుండా ఏ వంటా చేయలేంకూడా. అయితే కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిల్లో ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ‌ల‌ను రోజూ ప‌చ్చిగానే తినాలి. క‌నీసం ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ‌ను రోజూ తిన్నా చాలు.. ఎంతో ఫ‌లితం ఉంటుంది. పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఉల్లిపాయ‌ల‌ను రోజూ ప‌చ్చిగానే తినేవారు. మ‌జ్జిగ అన్నంలో వారు ఉల్లిపాయ‌ల‌ను తినేవారు. ఇలా తిన‌డం వ‌ల్ల‌నే వారికి ఎలాంటి రోగాలు రాలేదు. ఎక్కువ రోజులు జీవించారు. అందువ‌ల్ల ఉల్లిపాయ‌ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిని ప‌చ్చిగా తింటే కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
 
ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త‌నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిన‌లేమ‌ని అనుకునే వారు వాటితో టీ త‌యారు చేసి తాగొచ్చు. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది. 

ఉల్లిపాయ‌ల‌తో టీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా 2 క‌ప్పుల నీళ్ల‌ను తీసుకుని పాత్ర‌లో పోసి స్ట‌వ్‌పై పెట్టి మరిగించాలి. అందులోనే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వేయాలి. నీళ్లు 1 క‌ప్పు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత వ‌డ‌కట్టాలి. అనంత‌రం అందులో రుచి కోసం తేనె, నిమ్మ‌ర‌సం క‌లుకోండి. అంతే ఉల్లిపాయ‌ల టీ రెడీ అవుతుంది. దీన్ని రోజుకు ఒక‌సారి తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. అంతేకాదు కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ఇలా ఉల్లిపాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.