పిల్లలకు వేయించే టీకాలతో భవిష్యత్తులో అటిజం సమస్య వేధించే అవకాశం ఉందా.. ఇందులో నిజం ఎంత..!

టీకా.. సాధారణంగా ఈ టీకాల్లో రెండు రకాలు ఉంటాయి పిల్లలు పుట్టిన వెంటనే జీవితకాలం కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఈ టీకాలు వేయిస్తారు అలాగే శరీరంలో వ్యాధి సంబంధించినప్పుడు ఆ వ్యాధి విరుగుటకు ఇంజక్షన్ ద్వారా

పిల్లలకు వేయించే టీకాలతో భవిష్యత్తులో అటిజం సమస్య వేధించే అవకాశం ఉందా.. ఇందులో నిజం ఎంత..!


టీకా.. సాధారణంగా ఈ టీకాల్లో రెండు రకాలు ఉంటాయి పిల్లలు పుట్టిన వెంటనే జీవితకాలం కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఈ టీకాలు వేయిస్తారు అలాగే శరీరంలో వ్యాధి సంబంధించినప్పుడు ఆ వ్యాధి విరుగుటకు ఇంజక్షన్ ద్వారా ఇచ్చే ఔషధం అనే సంగతి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఎన్నో రకాల వ్యాధులు చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు సంభవిస్తూ ఉన్నాయి. వీటిలోని చాలావరకు వ్యాధులను టీకాల ద్వారా నిర్మూలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సంభవించిన కరోనా వ్యాధి కూడా టీకాలను కనిపెట్టడం వలన చాలావరకు నిర్మూలించగలిగారనే సంగతి అందరికీ తెలిసిందే.

పెద్దవారిలో వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన వారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీకాలను వేయించుకుంటూ ఉంటారు. కానీ చిన్నపిల్లల్లో వ్యాధులను ఎదుర్కొనేందుకు శక్తి తక్కువగా ఉండటం వలన వారికి వ్యాధులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు టీకాలను వేయిస్తూ ఉంటారు.

తల్లితండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తారు. వారికి టీకాలు వేయించేటప్పుడు పిల్లలు సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడతారేమో వారు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారేమోనని తల్లిదండ్రులు సర్వసాధారణంగా  ఉంటారు అపోహ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ టీకాలు పిల్లలకు వేయించడం వల్ల ఆటిజం వస్తుందేమోనని వారు ఆందోళన  చెందుతూ వుంటారు.

కాగా పిల్లలకు వేయించే వ్యాక్సిన్‌లు ఆటిజమ్‌కు కారణమవుతుందనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాక్సిన్‌లు ఆటిజమ్‌కు దారితీస్తాయనే వాదన 1998లో ఒక న్యూస్ మ్యాగజైన్లో వచ్చిన అప్పటినుంచి ఈ వాదన ఎన్నో రకాలుగా వినిపిస్తూ వస్తుంది అయితే ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని ఇప్పటికే పల అధ్యయనాలు తెలిపాయి టీకాకు ఆర్టిజన్ కు ఎలాంటి సంబంధం లేదని టీకా వ్యాక్సిన్ అనేది పూర్తిగా సురక్షితమైనదని చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.