తొడభాగంలో కొవ్వు కరగాలంటే ఇలా చేయండి..!

శరీరానికి సంబంధించి ఒక్కోక్కరిది ఒక్కో సమస్య.. కొంతమంది లావుగా ఉంటే.. ఇంకొంతమంది సన్నగా ఉంటారు.. వీటన్నింటికి కంటే.. ముఖ్యమైనది.. పాపం కొంతమంది సన్నగానే ఉంటారు.. కానీ కేవలం పొట్ట ఎక్కువగా ఉంటుంది లేదా. కేవలం తొడలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి.

తొడభాగంలో కొవ్వు కరగాలంటే ఇలా చేయండి..!


శరీరానికి సంబంధించి ఒక్కోక్కరిది ఒక్కో సమస్య.. కొంతమంది లావుగా ఉంటే.. ఇంకొంతమంది సన్నగా ఉంటారు.. వీటన్నింటికి కంటే.. ముఖ్యమైనది.. పాపం కొంతమంది సన్నగానే ఉంటారు.. కానీ కేవలం పొట్ట ఎక్కువగా ఉంటుంది లేదా. కేవలం తొడలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి.. ఈ తొడలు ఎక్కువగా ఉన్నవారికి అయితే.. నడుము సన్నగా ఉండటం వల్ల షార్ట్‌, జీన్స్‌ సెలెక్ట్‌ చేసుకోవడంలో ఇబ్బంది. ఎక్సెల్‌ అయితే నడుము లూజ్‌ అవుతుంది.. తొడలకు సరిపోతుంది. ఎల్‌ తీసుకుంటే.. నడుము దగ్గర బాగుంటుంది కానీ తొడ దగ్గర టైట్‌గా ఉంటుంది. పెద్ద సమస్య అసలు..! తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరాకృతికి తగ్గట్లుగా దృఢంగా తయారుకావాలంటే ఈ చిట్కాలు పాటించండి.


గోడకుర్చీ వేసినట్లుగా కూర్చొని బరువులెత్తడం (స్క్వాట్స్) వల్ల కూడా తొడ భాగంలోని కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల సమస్య నుంచి క్రమక్రమంగా ఉపశమనం కలుగుతుంది.

మన శరీరంలో కొన్ని జీవక్రియలు నీటితో ముడిపడి ఉంటాయి. నీళ్లు సరిగా తాగనట్లయితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తి, తద్వారా మెటబాలిజం ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత నీరు తాగుతూ శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి.

శరీరంలోని ప్రతి కండరం దృఢంగా మారడానికి సరైన వ్యాయామం ఈతకొట్టడం. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజూగ్గా తయారుకావచ్చు. ఇది కూడా తొడ భాగంలో కొవ్వు కరగడానికి సహాయపడే వ్యాయామాల్లో ఉత్తమైన వ్యాయామం.

లిఫ్ట్, ఎస్కలేటర్లు వాడకండి.. మెట్లెక్కి వెళ్లండి. దీనివల్ల తొడ కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా ఈ భాగంలో క్రమంగా కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.

పోషకాలు ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాయామాల్లో భాగంగా దీన్ని కూడా ప్రయత్నించండి. అలాగే దగ్గరి దూరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడైనా సాధ్యమైనంతవరకు సైకిల్‌పై వెళ్లడం మంచిది.

గడ్డి మీద నడవడం, జాగింగ్ చేయడం లాంటి వాటి వల్ల కేవలం తొడల భాగంలోనే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన అదనపు క్యాలరీలు, కొవ్వు కరిగి ఫలితంగా బరువు తగ్గచ్చు. ఈ వ్యాయామాలు ఉదయం చేయడమే మంచిది. ఎందుకంటే ఉదయం పూట గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు త్వరగా కరుగుతాయి.

తొడ భాగంలోని కొవ్వును కరిగించుకోవడానికి ఉపకరించే పరికరం.. లెగ్ ఎక్స్‌టెన్షన్ మెషీన్. దీనిపై కూర్చుని కాళ్లను నెమ్మదిగా ముందుకు చాపుతూ తిరిగి వెనక్కి తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా తగ్గాలని వేగంగా చేస్తే తొడల భాగంలో ఉండే కండరాలకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ప్రతిరోజూ ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఆడండి. దీంతో ఎంజాయ్‌మెంట్‌తో పాటు తొడ భాగంలో కొవ్వు కూడా కరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.