ఏక‌పాద అథోముఖ స్వ‌నాస‌న: పొట్ట దగ్గరి కొవ్వును వెన్నలా కరిగించే ఆసనం 

ఈరోజుల్లో చాలామంది పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా అయిపోయి.. అది వేలాడుతూ కనిపస్తుంది.. ముఖ్యంగా మహిళలు అయితే ఈ బెల్లి ఫ్యాట్‌ను కవర్‌ చేయలేక నానా తంటాలు పడుతుంటారు. పొట్టతగ్గాలని డైట్‌ కూడా చేస్తుంటారకు.

ఏక‌పాద అథోముఖ స్వ‌నాస‌న: పొట్ట దగ్గరి కొవ్వును వెన్నలా కరిగించే ఆసనం 


ఈరోజుల్లో చాలామంది పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా అయిపోయి.. అది వేలాడుతూ కనిపస్తుంది.. ముఖ్యంగా మహిళలు అయితే ఈ బెల్లి ఫ్యాట్‌ను కవర్‌ చేయలేక నానా తంటాలు పడుతుంటారు. పొట్టతగ్గాలని డైట్‌ కూడా చేస్తుంటారకు. స‌రైన ప్ర‌కారం చేస్తే.. అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకోవ‌డం సుల‌భ‌మే.. మీరు ఈ ఒక్క ఆసనం డైలీ వేయండి.. పొట్ట దగ్గరి కొవ్వు అంతా కరిగిపోతుంది.

Yoga : రోజూ ఈ ఒక్క ఆస‌నం వేస్తే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా  కరిగించుకోవ‌చ్చు.. అదేమిటంటే..?

 ఏక‌పాద అథోముఖ స్వ‌నాస‌న.. దీని గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.. ఇది యోగాలో ఒక ఆస‌నం. దీన్ని వేయడం చాలా సుల‌భ‌మే. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..

నేల‌పై ముందుగా నిటారుగా నిల‌బ‌డాలి. ముందుకు వంగి అర‌చేతుల‌ను నేల‌పై ఉంచాలి. రెండు అర‌చేతుల మ‌ధ్య దూరం ఉండాలి. ఇప్పుడు ఒక కాలుని గాలిలో వీలైనంత వ‌ర‌కు పైకెత్తి అలాగే ఉంచాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. త‌రువాత గాలిలో ఉన్న కాలును కింద‌కు దించాలి. అనంత‌రం రెండో కాలుని పైకెత్తి అలాగే చేయాలి. ఇలా ఈ ఆస‌నాన్ని రోజూ సౌక‌ర్య‌వంతంగా ఉండే వ‌ర‌కు వేయ‌వ‌చ్చు.

ఈ ఆస‌నాన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా చేతులు, పొట్ట‌, తొడ‌ల కండ‌రాల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ఆయా భాగాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. శ‌రీరం చ‌క్కని ఆకృతిలోకి వ‌స్తుంది.

ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. 

నడిచేట‌ప్పుడు, ఇత‌ర ప‌నులు చేసేట‌ప్పుడు నేల‌పై బ్యాలెన్స్ స‌రిగ్గా ఉంటుంది. చ‌క్క‌గా న‌డ‌వ‌గ‌లుగుతారు.

ఈ ఆసనాన్ని డైలీ మీకు వేయగలిగినంత సేపు వేయండి. మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఈ ఆస‌నాన్ని హైబీపీ పేషెంట్లు, తీవ్ర‌మైన చేతి, కాలి నొప్పులు ఉన్న‌వారు, కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్, వేరు చేయబడిన కంటి రెటీనా, బలహీనమైన కంటి కేశనాళికలు, స్థానభ్రంశం చెందిన భుజం / భుజం గాయం లేదా అతిసారంతో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనం చేయడం మానుకోండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.