రక్తహీనత నుంచి మెదడు పనితీరు మెరుగుపరచడం వరకు ఎన్నో సమస్యలు దూరం చేసే పాలకూరతో కలిగే ప్రయోజనాలు ఎన్నో!

రోజువారి ఆహారంలో అన్ని రకాల పోషకాలు అందాలి. అందుకే భోజనంలో ఓ ఆకుకూర ఉండేలా చూసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. కానీ రకరకాల చిరుతిళ్లు, వేపుడు కోర్లకు అలవాటు పట్టు చిన్నారులు ఆకుకూరలు తినేందుకు మాత్రం ఇష్టపడటం లేదు.

రక్తహీనత నుంచి మెదడు పనితీరు మెరుగుపరచడం వరకు ఎన్నో సమస్యలు దూరం చేసే పాలకూరతో కలిగే ప్రయోజనాలు ఎన్నో!


రోజువారి ఆహారంలో అన్ని రకాల పోషకాలు అందాలి. అందుకే భోజనంలో ఓ ఆకుకూర ఉండేలా చూసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. కానీ రకరకాల చిరుతిళ్లు, వేపుడు కోర్లకు అలవాటు పట్టు చిన్నారులు ఆకుకూరలు తినేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. కానీ... వారికి కావాల్సిన ఎన్నో పోషకాలను ఆకుకూరలు సమర్థవంతంగా అందిస్తాయి. వాటిలో ఒకటి... పాల కూర. ఈ కూరతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి. 

5 Interesting Types of Lettuce

పాల‌కూరలో మన శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు లభిస్తాయి. అందువల్ల పోష‌కాహార లోపం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పాల‌కూర‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. ఎదుగుదల అవసరం అయిన పిల్లలకి ఇది మేలు చేస్తుంది.  

పాల‌కూర‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. కనుక దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే... శ‌రీరంలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. బలహీనంగా ఉన్న పిల్లలు పాలకూర మంచి బలాన్ని అందిస్తుంది. 

పాల‌కూర‌ను జ్యూస్ రూపంలో రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక క‌ప్పు మోతాదులో తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

పాల‌కూర‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు._*

పాల‌కూర‌లో మెద‌డు ప‌నితీరుకు అవ‌స‌రం అయ్యే పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని తింటే మెద‌డు చురుగ్గా మారుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. పిల్ల‌లు చ‌దువుల్లో రాణిస్తారు.

పాల‌కూర ర‌క్తాన్ని పలుచ‌గా చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. జుట్టు, చ‌ర్మం ఆరోగ్యంగా కూడా పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది.

పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు లైంగిక చర్యలో  చురుగ్గా పాల్గొంటారు. పాల‌కూర‌ను రోజూ నేరుగా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. సూప్స్‌, స‌లాడ్స్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.