నిద్ర పట్టడం లేదా? అయితే ఇలా చేయండి 

ఈరోజుల్లో నిద్రపట్టకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. చాలా మంది నిద్ర సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అప్పట్లో పెద్దవాళ్లు వయసు పైబడటంతో కీళ్లనొప్పులు, వృద్ధాప్య సమస్యల వల్ల వారికి నిద్ర పట్టేది కాదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు. 

నిద్ర పట్టడం లేదా? అయితే ఇలా చేయండి 


ఈరోజుల్లో నిద్రపట్టకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. చాలా మంది నిద్ర సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అప్పట్లో పెద్దవాళ్లు వయసు పైబడటంతో కీళ్లనొప్పులు, వృద్ధాప్య సమస్యల వల్ల వారికి నిద్ర పట్టేది కాదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు. 

పల్లెటూర్లలో అయితే రాత్రి 9 అయ్యే సరికి పనులన్నీ ముగించేసుకుని పడుకుండిపోతారు. అదే సిటీల్లో అయితే చాలా మంది తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోరు. అర్ధరాత్రి ఒంటిగంట వరకూ పడుకోకుండా ఉంటారు. అదే చిన్నపిల్లలకూ అలవాటైపోతుంది. దానివల్ల ఉదయం స్కూళ్లకు వెళ్లేటప్పుడు కునుకుతూ ఉంటారు. అది మంచిది కాదు. 

అయితే ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. కుటుంబసమస్యలు, బయట సమస్యలు, ఏవేవో ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. ఆలోచనల వల్లే నిద్రపట్టడం లేదని తెలిసినా....కంట్రోల్‌ చేసుకోలేరు. ప్రతి దానికి ఒత్తిడి చెందకూడదు...దానివల్ల నిద్రపట్టదు. పడుకునే ముందే సెల్‌ఫోన్లు చూడటం...ల్యాప్‌టాప్‌లు చూస్తూ ఉంటారు. 
రాత్రంతా పడుకోకపోతే....పొద్దున్న ఉత్సాహంగా ఉండలేం. ఏ పనుల్లోనూ చురుకుగా పని చేయలేం. పనిచేస్తున్నప్పుడే...ఆవలింతలు వచ్చేస్తుంటాయి. అప్పుడు అది మన పనిమీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఒక మనిషి 6 నుంచి 7 గంటలు పడుకోవాలి. అదే ఆరోగ్యకరమైన నిద్ర. తినగానే కాకుండా తిన్న 2 గంటల తర్వాత పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది.

హాయిగా పడుకోవాలంటే చిట్కాలు, మార్గాలు పాటించాల్సిందే. లేకపోతే అనారోగ్యానికి గురికాకతప్పదు. 

పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. దీని వల్ల మెదడుకు జరిగే రక్తప్రసరణలో ఇబ్బంది తలెత్తి, అది మన నిద్రను చెడగొడుతుంది. అనారోగ్యానికి కారణం గా మారుతుంది.
బాగా నిద్రపోవాలి అనుకునే ముందు ఉదయం చేసిన పని నుంచి విశ్రాంతి తీసుకోవాలి. ౩ గంటల ముందే భోజనం ముగించేయ్యాలి. అప్పుడే ఆహారం జీర్ణమై నిద్ర సుఖంగా వస్తుంది. 
రాత్రిళ్లు కాస్త గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే శరీరంతో పాటు మనసుకు హాయిగా ఉంటుంది. తర్వాత పడుకుంటే ఖచ్చి
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.