రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చా! ఇది ఎంతవరకు ఆరోగ్యకరం..

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి అన్నాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో కూడా అన్నాన్ని తినే అలవాటు ఉండటంవల్ల మిగిలిపోయిన అన్నం వరకు ఉంచి ఉదయాన తింటూ ఉంటారు.

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చా! ఇది ఎంతవరకు ఆరోగ్యకరం..


దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి అన్నాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో కూడా అన్నాన్ని తినే అలవాటు ఉండటంవల్ల మిగిలిపోయిన అన్నం వరకు ఉంచి ఉదయాన తింటూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి పాటిస్తూ వస్తున్న ఈ అలవాటు అసలు మంచిదా కాదా ఇలా తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాం.

సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే పెరుగు లేదా మజ్జిగ వేసుకొని తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే ఒక్కసారి వండినా అన్నాన్ని రెండోసారి వేడి చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని తెలుస్తోంది..

సాధారణంగా అన్నాన్ని, అన్ని రకాల ఆహార పదార్థాలను 165 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు 15 సెకన్ల పాటు వేడి చేయడం వల్ల మిగిలిన వ్యాధికారక, బ్యాక్టీరియాను చంపేస్తుంది. కాగా మిగిలిపోయిన వాటిని తినడం వల్ల పోషకాలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తాజాగా వండిన ఆహారాన్ని 3 గంటలలోపు తినాలి. 

కానీ కొన్నిసార్లు నిల్వ ఉంచుతూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచినప్పుడు 12 గంటలకు మించి అన్నాన్ని నిల్వ ఉంచకూడదు ఏ ఆహార పదార్థాన్ని కూడా ఇంతకంటే ఎక్కువ సమయం నిలువ ఉంచడం సరైన పద్ధతి కాదు. ఇంకా మిగిలిపోయిన వాటిని తినడం మీ పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మంటను ప్రేరేపిస్తుంది. శరీరంలో విషాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం మిగిలిపోయిన వాటిని తినడం వల్ల పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

పురాతన కాలం నుంచి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక మట్టి కుండలో ఉంచి దానిలో కొంచెం నీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉదయం వరకు అలాగే ఉంచేవారు. ఉదయాన్నే అందులో కొంచెం మజ్జిగ కలుపుకొని తినటం వల్ల శరీరానికి చల్లదనం అందడంతో పాటు అందులో ఉండే పోషకాలు కూడా అందేవి. కానీ ఇప్పటి రోజుల్లో బియ్యం లో నాణ్యత తగ్గిపోవడం ఇంత ఓపికగా ఈ విధానాన్ని పాటించకపోవడం వల్ల పలు రకాల సమస్యలు వస్తున్నాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.