జుట్టు పలుచగా ఉండి స్కాల్ప్‌ కనిపిస్తుందా.. ఇలా చేయండి..! 

కొంతమందికి జుట్టు పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచుగా ఉంటుంది. స్కాల్ప్‌ అంతా కనిపిస్తుంది. అలాంటప్పుడు జుట్టు ఎంత పొడవుగా ఉన్నా ఏం లాభం చెప్పండి. జుట్టు రాలడం, పెరగకపోవడం ఒక సమస్య అయితే.. ఇలా పలుచగా ఉండటం మరో సమస్య. కొద్దిగా ఉన్నా ఒత్తుగా ఉంటే చూడ్డానికి అందంగా ఉంటుంది

జుట్టు పలుచగా ఉండి స్కాల్ప్‌ కనిపిస్తుందా.. ఇలా చేయండి..! 


కొంతమందికి జుట్టు పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచుగా ఉంటుంది. స్కాల్ప్‌ అంతా కనిపిస్తుంది. అలాంటప్పుడు జుట్టు ఎంత పొడవుగా ఉన్నా ఏం లాభం చెప్పండి. జుట్టు రాలడం, పెరగకపోవడం ఒక సమస్య అయితే.. ఇలా పలుచగా ఉండటం మరో సమస్య. కొద్దిగా ఉన్నా ఒత్తుగా ఉంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. మరి మీ జుట్టుకు ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే నాచురల్‌ ఐటమ్స్‌తో ఒక చిట్కాను తయారు చేసుకోని వాడండి. ఈ ఆయుర్వేద చిట్కాతో రిజల్ట్‌ వందశాతం ఉంటుంది. మెయిన్‌గా స్కాల్ప్‌ కనిపించి పలుచుగా జుట్టు ఉన్నవాళ్లకు ఇది బాగా యూస్‌ అవుతుంది. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి…అలాగే ఎలా వాడాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల జుట్టుకు త‌గిన పోష‌కాలు అంద‌క జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. ఇంకా ఎక్కువ‌గా దెబ్బ‌తింటుంది. జుట్టు రాల‌కుండా ఉండాలంటే మ‌నం జుట్టుకు పోష‌కాలను అందించాలి. జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాల‌ను క‌లిగి ఉండే వాటిల్లో ఉల్లిపాయ ఒక‌టి. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఉల్లిపాయ‌తో నీటిని తయారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. 
ఈ నీటిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మ‌ధ్య‌స్థంగా ఉండే మూడు ఉల్లిపాయ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్క‌ల‌ను ఉడికించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీటిని వ‌డ‌క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లిపాయ నీరు త‌యార‌వుతుంది. ఈ నీరు గోరు వెచ్చ‌గా ఉన్నప్పుడే.. జుట్టుకు ప‌ట్టించాలి. అయితే ఈ ఉల్లిపాయ నీటిని జుట్టుకు ప‌ట్టించేట‌ప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి. ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. త‌రువాత జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఈ నీటిని రెండు గంట‌ల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు అంది జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ‌ల‌తో నీటిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అంద‌మైన‌, ఒత్తైన‌, ఆరోగ్య‌వంత‌మైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.