Skin care : ఈనోతో ఇలా చేస్తే... 5 నిమిషాల్లో మెరిసే ముఖం మీ సొంతం..!

Skin care : కళకు కాదేది అనర్హం అంటారు.. ఇప్పుడు అందానికి కూడా కాదేది అనర్హం అన్నట్లు తయారైంది.. డీజిల్‌ను తలకు రాసేస్తున్నారు, ఆస్ర్పిన్‌ ట్యాబ్లెట్‌ను ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుంటున్నారు. మొటిమలకు టూత్‌ పేస్ట్‌ను వాడేస్తున్నారు.

Skin care : ఈనోతో ఇలా చేస్తే... 5 నిమిషాల్లో మెరిసే ముఖం మీ సొంతం..!


Skin care : కళకు కాదేది అనర్హం అంటారు.. ఇప్పుడు అందానికి కూడా కాదేది అనర్హం అన్నట్లు తయారైంది.. డీజిల్‌ను తలకు రాసేస్తున్నారు, ఆస్ర్పిన్‌ ట్యాబ్లెట్‌ను ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుంటున్నారు. మొటిమలకు టూత్‌ పేస్ట్‌ను వాడేస్తున్నారు.. ఇప్పుడు కడుపు ఉబ్బరానికి తాగే ఈనోను కూడా వదలడం లేదు. ఈనోతో ఇన్‌స్టెంట్‌గా ముఖాన్ని అందంగా మెరిసేలే చేసుకోవచ్చట. మ‌న ముఖ సౌంద‌ర్యాన్ని ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి చాలా సుల‌భంగా మెరుగుప‌రుచుకోవ‌చ్చు. అందాన్ని మెరుగుప‌రిచే చిట్కా గురించి, ఆ చిట్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి, అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

నిమ్మ‌కాయ‌లు, ఈనో ప్యాకెట్‌ మీ దగ్గర ఉంటే చాలు.. మీరు అనుకోవచ్చు.. ఈనోతో ఏంట్రా ఫేస్‌ ప్యాక్‌ అని.. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందట.. ఇప్పటికే ఈ చిట్కాను చాలా మంది ట్రై చేసి మంచి ఫలితాలను పొందారు. నిమ్మ‌కాయ‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది మ‌న చ‌ర్మంపై ఉండే మృత క‌ణాల‌ను తొల‌గిస్తుంది. నిమ్మ‌కాయ ర‌సం మ‌న చ‌ర్మంపై ఉండే స్వేద గ్రంథుల‌ల్లోకి వెళ్లి అందులో ఉన్న మురికిని తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇనోలో ఉన్న ప‌దార్థాలు మ‌న చ‌ర్మంపైన ఉన్న జిడ్డును తొల‌గించి చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. 
ఒక గిన్నెలో ఇనో పౌడ‌ర్‌ను వేయండి.. అందులో నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. నిమ్మ‌ర‌సం వేయ‌డం వ‌ల్ల ఇనో పౌడ‌ర్ పొంగుతుంది. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సున్నితంగా ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మురికి, జిడ్డు తొల‌గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఎప్పుడైనా వెంట‌నే బ‌య‌ట‌కు వెళ్లాలి అన్న‌ప్పుడు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల 5 నిమిషాల్లోనే అంద‌మైన, మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. విటమిన్‌ సీ చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈనో, నిమ్మరసం అంటే..విటమిన్‌ సీ అధికంగానే ఉంటుంది.. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.