మీ జుట్టు బాగా పెరగాలంటే.. నియాసినమైడ్ వాడాల్సిందే..! 

జుట్టు బాగా ఒత్తుగా పెరగాలంటే... అందుకు కావాల్సిన పోషకాలు, విటమిన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ విటమిన్‌ వల్ల జుట్టు బాగా పెరుగుతుందో అవి మనం ఇచ్చామంటే.. మంచి రిజల్ట్‌ ఉంటుంది. జుట్టు సంరక్షణలో నియాసినమైడ్

మీ జుట్టు బాగా పెరగాలంటే.. నియాసినమైడ్ వాడాల్సిందే..! 


జుట్టు బాగా ఒత్తుగా పెరగాలంటే... అందుకు కావాల్సిన పోషకాలు, విటమిన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ విటమిన్‌ వల్ల జుట్టు బాగా పెరుగుతుందో అవి మనం ఇచ్చామంటే.. మంచి రిజల్ట్‌ ఉంటుంది. జుట్టు సంరక్షణలో నియాసినమైడ్ అనే బీ3 విటమిన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు, అది వేటిలో లభిస్తుందో తెలుసుకోండి.

మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడే ముఖ్యమైన విటమిన్ బీ 3. దీనినే నియాసినమైడ్ అని కూడా అంటారు. మీ స్కాల్ప్‌పై ఇన్‌ఫ్లమేషన్‌ను నిరోధిస్తూ, రక్త ప్రసరణ పెంచుతూ, కెరటిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండడంలో ముఖ్యమైన ప్రోటీన్ కెరటిన్.

అయితే నియాసిన్ వేరు. నియాసినమైడ్ వేరు. ఇది మరొకరకమైన బీ3 విటమిన్. అయితే మీ శరీరంలో నియాసిన్ అధికంగా ఉన్నప్పుడు అది నియాసినమైడ్‌గా మారిపోతుంది. నియాసినమైడ్ ఎక్కువగా మాంసం, పాలు, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాల్లో లభిస్తుంది. హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కూడా లభ్యమవుతుంది. అందువల్ల ఈ నియాసినమైడ్ విటమిన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గానీ, జుట్టుకు అప్లై చేసే ఉత్పత్తుల రూపంలో కానీ తీసుకోవచ్చు.

నియాసినమైడ్ (విటమిన్ బీ3) జుట్టు ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని నికోటినమైడ్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ప్రొటీన్స్, లిపిడ్స్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కణశక్తిని పెంపొందిస్తుంది. శరీరం వినియోగించుకునేలా కార్బోహైడ్రేట్లను సింథసైజ్ చేస్తుంది. సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

‘నియాసినమైడ్ జుట్టు ఫాలికల్స్‌కు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టుకు బలాన్నిస్తుంది. మాడు ఆరోగ్యకరంగా ఉంటుంది. మాడుపై మంటను తగ్గిస్తుంది.

నియాసినమైడ్ ఒక్క జుట్టుకు మాత్రమే కాదు.. చర్మ సంరక్షణకు కూడా బాగు ఉపయోగపడుతుంది. నియాసినమైడ్ ఉన్న ఫేస్‌ సిరమ్స్‌ వాడితే మీ ముఖంపై మచ్చలు తగ్గుతాయి.. చర్మం కాంతివంతగా మారుతుంది. జుట్టుకు నియాసినమైడ్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోని ట్రై చేసి చూడండి. !

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.