తిన్న వెంటనే 100 అడుగులు నడిస్తే మంచిదా? అసలు ఇలా ఎందుకు చేయాలి..

తిన్నవెంటనే నడిస్తే మంచిదా.. కాదా? లేదా కాసేపాగి విశ్రాంతి తీసుకుని నడవాలా?.. ఇలా అనేక ప్రశ్నలు మెదులుతుంటాయి. చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. దీనికి ఆయుర్వేదం, ఆధునిక సైన్స్​ ఏం చెబుతుందంటే?

తిన్న వెంటనే 100 అడుగులు నడిస్తే మంచిదా? అసలు ఇలా ఎందుకు చేయాలి..


తిన్నవెంటనే నడిస్తే మంచిదా.. కాదా? లేదా కాసేపాగి విశ్రాంతి తీసుకుని నడవాలా?.. ఇలా అనేక ప్రశ్నలు మెదులుతుంటాయి. చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. దీనికి ఆయుర్వేదం, ఆధునిక సైన్స్​ ఏం చెబుతుందంటే?

Calories Burned Walking: How to Calculate Based on Weight and Pace

ఆధునిక వైద్యం ఏం చెబుతుందంటే?..  

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనలర్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం కడుపునొప్పి, ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేని వాళ్లు తిన్న వెంటనే వేగంగా నడవచ్చు. తిన్నవెంటనే అరగంట వేగంగా నడవటం ద్వారా బరువు తొందరగా తగ్గుతారని ఈ నివేదికలో తేలింది.

ఆయుర్వేదం ఏమంటుంది అంటే..?

ఆయుర్వేదం ప్రకారం వేగంగా నడవటం ఆరోగ్యకరం కాదట.  వేగంగా నడవటం వల్ల శరీర దోషాలు పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.  'షట్‌పవలి' ఆహారం జీర్ణం కావడానికి మంచి మార్గం అని తెలిపింది. షట్ అంటే 100- పవలి అంటే అడుగులు. మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత  నిదానంగా వంద అడుగులు వేస్తే మంచిదని షట్​పవలి అర్థం. వంద అడుగులు వేయడం లేదా పదిహేను నిమిషాలు నిదానంగా నడవటం మంచిదట.

వంద అడుగుల వల్ల కలిగే లాభాలు..

1. జీర్ణం.. ఆహారం జీర్ణం కావడానికి గ్యాస్ట్రిక్ జ్యూసులు, ఎంజైమ్స్ కావాలి. తిన్న వెంటనే నడవటం వల్ల ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభమై అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు కూడా రావు.

2. సోమరితనం..  తిన్న తర్వాత మత్తుగా అనిపిస్తుంది. కాసేపు ఏ పనీ చేయాలనిపించదు. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. మనం తీసుకునే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అరిగించడానికి ఎక్కువగా సెరటోయిన్ ఉత్పత్తి కావడమేనట అసలు బద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి తిన్నాక అడుగులు వేస్తే ఈ సమస్య రాదు.

3. బరువు తగ్గటం.. తిన్న తరువాత వంద అడుగులు వేయడం వల్ల బరువు కూడా తగ్గుతారట. కేలరీలు కరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారట.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.