Jasmine leaves : మొఖంపై మంగు మచ్చలా.. ఖర్చులేకుండా ఇలా ఈజీగా పోగొట్టుకోవచ్చు..!

Jasmine leaves ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్యలను తగ్గించుకోవచ్చు.మంగు మ‌చ్చ‌లు నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు.

Jasmine leaves   : మొఖంపై మంగు మచ్చలా.. ఖర్చులేకుండా ఇలా ఈజీగా పోగొట్టుకోవచ్చు..!
Dark spots


పల్లెటూర్లల్లో మల్లెచెట్టు, విరజాజుల తీగలు కామన్‌గా ఉంటాయి.. ఇళ్లకు పాకించేస్తారు. సాయంత్రం అయ్యేసరికి చక్కగా వాటికి నీళ్లు పట్టి పూలు కోస్తుంటారు.. మల్లె పువ్వులు మాత్రమే కాదు.. ఆ చెట్టు ఆకులు కూడా మనం వాడుకోవచ్చు తెలుసా..? మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్యలను తగ్గించుకోవచ్చు. మంగు మ‌చ్చ‌లు నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.

మంగు మచ్చలు ఎందుకు వస్తాయి..

  • ఎండ‌లో ఎక్కువ‌గా ప‌ని చేసే వారికి, ర‌సాయ‌నాల‌ను క‌లిగిన ఫేస్ వాష్ ల‌ను, క్రీముల‌ను వాడే వారికి ఈ మ‌చ్చ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి.
  • గ‌ర్భిణీలలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ల కార‌ణంగా కూడా మంగు మ‌చ్చ‌లు వ‌స్తాయి. ప్ర‌సావానంత‌రం ఇవి వాటిక‌వే త‌గ్గుతాయి.
  • మంగు మ‌చ్చలు ముఖం పైనే కాకుండా ఇత‌ర శ‌రీర భాగాల‌పై కూడా వ‌స్తాయి.
  • మ‌గ‌వారిలో కంటే ఆడ‌వారిలో ఎక్కువ‌గా వ‌స్తాయి.
  • న‌ల్ల‌గా ఉన్న వారిలో కంటే తెల్ల‌గా ఉన్న వారిలోనే ఇవి ఎక్కువ‌గా వ‌స్తాయి. 
    ఈ మ‌చ్చ‌ల వ‌ల్ల ఎలాంటి హాని క‌ల‌గ‌దు. ఎలాంటి నొప్పి కూడా ఉండ‌దు. కానీ ఇవి చూడ‌డానికి అంద‌విహీనంగా ఉంటాయి.

మల్లె ఆకులతో ఎలా తగ్గించుకోవవచ్చు..
 
వీటిని మ‌నం ఎటువంటి ఖ‌ర్చు లేకుండా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి నివారించుకోవ‌చ్చు. మ‌ల్లెచెట్టు ఆకుల‌ను, జాజికాయ‌ను క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని మంగు మ‌చ్చ‌ల‌పై రాసి గంట నుండి రెండు గంట‌ల పాటు ఉంచి నీటితో క‌డిగేయాలి. అలాగే ఒక ఆలుగ‌డ్డ‌ను తీసుకుని పేస్ట్‌గా చేసి దానిని మంగుమచ్చ‌లపై రాయ‌డం వ‌ల్ల కూడా మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా మల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చని నిపుణులు అంటున్నారు. మీకు కానీ, మీకు తెలిసిన వారికి సమస్య ఉంటే..వారికి చెప్పండి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.