షుగర్‌ వ్యాధి మందులు వాడినా తగ్గడంలేదా..? ఈ రెండు మొక్కలను ట్రై చేయండి

షుగర్‌ అనేది ఈరోజుల్లో చాలామంది అనుభవించే సాధారణ సమస్య అయిపోయింది.. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్‌ బాధితులు అవుతున్నారు. షుగర్‌ వస్తే.. ముఖ్యంగా రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిలు తగ్గిపోతాయి

షుగర్‌ వ్యాధి మందులు వాడినా తగ్గడంలేదా..? ఈ రెండు మొక్కలను ట్రై చేయండి


Health : షుగర్‌ అనేది ఈరోజుల్లో చాలామంది అనుభవించే సాధారణ సమస్య అయిపోయింది.. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్‌ బాధితులు అవుతున్నారు. షుగర్‌ వస్తే.. ముఖ్యంగా రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిలు తగ్గిపోతాయి.. ఇక ఆ ఇన్సులిన్‌ను పెంచుకోవాడనికి మందులు, ఆయుర్వేద చిట్కాలు, ఆహారం తీసుకుంటారు. కొంద‌రిలో మందులు వాడిన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి ఎంత ప్ర‌య‌త్నించినా కూడా నియంత్ర‌ణ‌లో ఉండ‌దు. అయితే కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఉప‌యోగించి స‌హ‌జ సిద్దంగా మ‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మొక్క‌ల్లో ఇన్సులిన్ ప్లాంట్ ఒక‌టి.
Costus Igneus: Side Effects of the Insulin Plant for Diabetes
షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఈ మొక్క అద్భుతంగా ప‌ని చేస్తుంది. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ఇన్సులిన్ మొక్క‌లో ఉండే ర‌సాయ‌నాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త్వ‌ర‌గా త‌గ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ పెరిగేలా కూడా చేస్తాయట.. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒక‌టి చొప్పున తిన‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగ‌ర్ నైనా అదుపులోకి తెచ్చుకోవచ్చు.. అయితే ఈ మొక్క ఆకుల‌ను గ‌ర్భిణులు, పాలిచ్చే త‌ల్లులు అస్స‌లు తీసుకోకూడ‌దు.
అలాగే షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మ‌రో మొక్క పొడ‌ప‌త్రి మొక్క‌. ఇది తీగ జాతికి చెందిన బ‌హు వార్షిక మొక్క‌. ఇది ఎక్క‌డ పడితే అక్క‌డ ఉంటుంది. ఈ మొక్క ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని సంస్కృతంలో మేష శృంగి అని పిలుస్తారు. అంతేకాకుండా పుట్ట భ‌ద్ర‌, మ‌ధునాశిని అని కూడా పిలుస్తారు. పొడ‌ప‌త్రి మొక్క పూలు గుండ్రంగా ప‌సుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా చేదుగా ఉంటాయి. అయితే షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఈ మొక్క ఆకులు చ‌ప్ప‌గా అనిపిస్తాయట.. వ్యాధి లేని వారికి ఈ మొక్క ఆకులు చేదుగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను నేరుగా తినొచ్చు.. లేదా వాటితో క‌షాయాన్ని చేసుకుని తాగినా కూడా షుగ‌ర్ వ్యాధి నుంచి మ‌నం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పొడ‌ప‌త్రి మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. ఆస్థ‌మా వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. స్త్రీలు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాలు తొల‌గిపోతాయట... 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.