వ్యాయామం.. శక్తికి మించి వద్దు.. !

నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచన ఉంటుంది అయితే దీనికి

వ్యాయామం..  శక్తికి మించి వద్దు.. !
Overexercising


Overexercising : నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచన ఉంటుంది అయితే దీనికి అతి పనికిరాదు అంటున్నారు నిపుణులు..

 వ్యాయామం చేయాలి అనుకుంటే నిర్దిష్టమైన ప్రణాళిక కచ్చితంగా అవసరం ఇందుకోసం కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా తక్కువ సమయంలోనే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి అనే ఆలోచనను దూరం చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా వ్యాయమాన్ని పెంచుకుంటూ పోవాలి.. అలాగే వ్యాయామం చేయటానికి కచ్చితంగా మూడు గంటలు ముందే ఆహారాన్ని తీసుకోవాలి అలా కాకుండా ఆహారం తీసుకున్న గంట రెండు గంటల తర్వాత వ్యాయామం చేస్తే కండరాలు పట్టేయడంతో పాటు వికారానికి దారితీస్తుంది..

అలాగే ప్రతిరోజు వ్యాయామాన్ని ఒకేసారి పూర్తి చేయడం కాకుండా ముందుగా సన్నద్ధ వ్యాయమాలు చేయడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల క్రమంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్త సరఫరా మెరుగు పడుతుంది కండరాలన్నీ వదులయ్యి శరీరం తేలికగా మారుతుంది.. అయితే ఈ సన్నద్ధ వ్యాయామాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి శరీరాన్ని నిటారుగా ఉంచి చేయాలి అలాగే 20 నుంచి 30 సెకండ్ల పాటు ఒకే భంగిమలో నెమ్మదిగా వ్యాయామం చేసుకుంటూ పోవాలి.. 

అలాగే వ్యాయామం మొదలుపెట్టిన మొదట్లోనే అధిక బరువులు ఎత్తటం మానుకోవాలి క్రమక్రమంగా బరువును పెంచుకుంటూ పోవాలి తప్ప ఒక్కసారిగా ఇలా చేయడం వల్ల వెన్నుపాము కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాయామం సమయంలో ఊపిరిని బిగ పట్టకూడదు ఇలా చేయడం వల్ల శరీరాన్ని కావలసిన ఆక్సిజన్ అందదు.. అలాగే వ్యాయామానికి ముందే గట్టిగా ఉపనయన పీల్చుకొని వదలటం అలవాటు చేసుకోవాలి.. అలాగే మన సామర్థ్యం ఎంతవరకు మనం కచ్చితంగా అంచనా వేయగలగాలి దానిని రోజు రోజుకు పెంచుకుంటూ పోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి.. కొందరికి ఎంతో కాలం నుంచి వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది ఇలాంటి వారితో పోల్చుకుంటూ సమస్యలు తెచ్చుకోకుండా క్రమంగా శక్తిని పెంచుకుంటూ పోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.