ఈ లక్షణాలు ఉన్నాయా.. థైరాయిడ్ చెకప్ చేయించాల్సిందే..!

తల్లి గర్భంలో శిశువు ఉన్న దగ్గర నుంచి చివరి దశ వరకు శరీరం సక్రమంగా పనిచేయాలి అంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలి లేదంటే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి..ఇది శరీరం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఏ వయసు వారినైనా Thyroid వేధించే అవకాశం ఉంది

ఈ లక్షణాలు ఉన్నాయా..  థైరాయిడ్ చెకప్ చేయించాల్సిందే..!


తల్లి గర్భంలో శిశువు ఉన్న దగ్గర నుంచి చివరి దశ వరకు శరీరం సక్రమంగా పనిచేయాలి అంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలి లేదంటే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి.. ఇది శరీరం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఏ వయసు వారినైనా  Thyroid వేధించే అవకాశం ఉంది అందుకే ఈ లక్షణాలను తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం.. 

శరీరంలో ముఖ్యమైన ఎండోక్రైన గ్రంధులలో ఒకటైన థైరాయిడ్ మెడ ముందు భాగంలో ఉంటుంది ఈ గ్రంథ నుండి థైరాయిడ్ హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం పనితీరు సక్రమంగా ఉంటుంది.. ఈ హార్మోన్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఏర్పడిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.. 

ఈ హార్మోన్ పిల్లల శరీర అభివృద్ధికి, సరైన శారీరక, మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది.. అయితే పిల్లల్లో ఈ వ్యాధి రుగ్మత సాధారణమైనది ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 37 మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది..  ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి వలన  సంతనోత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది..   ఒక్కోసారి గర్భం దాల్చే అవకాశం కష్ట తరంగా మారుతుంది.. మరి కొన్నిసార్లు గర్భం దాల్చాక ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. నెలలు శిశువు జన్మించే అవకాశం సైతం ఉంటుంది. అలాగే విపరీతంగా జుట్టు ఊడిపోవడం, అతిగా బరువు పెరగటం లేదా విపరీతంగా బరువు తగ్గటం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే చిన్నపిల్లల్లో ఎదుగుదలకు ఈ హార్మోన్ అత్యవసరం అయితే చిన్న వయసులోనే థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తుండటంతో పిల్లల్లో ఈ వ్యాధి ఉందేమో ఎలా గుర్తించాలి అంటే... 

【暑期福利】家有学生成绩下降,注意力不集中,多动烦躁……要警惕“甲”健康_手机搜狐网

పిల్లల్లో కనిపించే థైరాయిడ్ లక్షణాలు ఏంటంటే.. 

చేతులు వణకడం
ఏకాగ్రత లేకపోవడం 
హృదయ స్పందన రేటు పెరగడం
బరువు తగ్గడం
ఉబ్బిన కళ్లు
మలబద్దకం
మూర్చ
అధిక చెమట
నిద్ర సమస్యలు

పెద్దవారిలో థైరాయిడ్ లక్షణాలు ఏంటంటే... 

ఒంట్లో శక్తి తగ్గడం
ఆకలి పెరగడం
ఆకలి లేకపోవడం.. 
విపరీతంగా బరువు పెరగటం..
ఒక్కసారిగా బరువు తగ్గటం..
కండరాల నొప్పి
జుట్టు ఊడిపోవడం
చర్మం విపరీతంగా పొడి బారటం

ఈ సమస్యను అదుపు చేయడానికి ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. హైపో థైరాయిడ్ వల్ల బరువు పెరిగిన వారు అయోడిన్ తీసుకోవడం మంచిది. అయోడిన్ శరీరంలో థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది. అందుకే అయోడిన్ ఎక్కువగా ఉండే అయోడైజ్డ్ సాల్ట్, చే, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఆకుకూరలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఈ వ్యాధి లక్షణాలను తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అదుపులో ఉంచుకోవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.