వయసు పైబడినా చర్మం మెరవాలంటే ఇలా ఉండండి

వయసు పెరిగితే జ్ఞానం, ఆత్మ విశ్వాసం  పెరుగుతుంది. దానితోపాటే సమస్యలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా నెలసరి సమస్యలు వేధిస్తాయి. మోనోపాజ్‌ వచ్చిందంటే..హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అంతటితో ఆగకుండా

వయసు పైబడినా చర్మం మెరవాలంటే ఇలా ఉండండి


వయసు పెరిగితే జ్ఞానం, ఆత్మ విశ్వాసం  పెరుగుతుంది. దానితోపాటే సమస్యలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా నెలసరి సమస్యలు వేధిస్తాయి. మోనోపాజ్‌ వచ్చిందంటే....హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అంతటితో ఆగకుండా చర్మ సమస్యలు, వీటితో పాటే ముఖంపై ముడతలు, ముఖం పాలిపోవడం, కళా విహీనంగా మారడం. ఒకదానితో పాటు ఒకటి అల్లుకుపోతాయి.

Here Is An Ultimate Guide To Get Healthy Glowing Skin | Be Beautiful India

చాలా మంది మహిళలు వయసు పైబడినా కూడా శరీరంపై, తినే తిండిపై, వేసుకునే దుస్తులపై ఆసక్తి చూపిస్తుంటారు. వ్యాయామాలు చేయడం, ముఖం అందంగా కనిపించేందుకు ఏవేవో తిప్పలు పడుతుంటారు. దాన్ని చూసి చాలా మంది ఈ వయసులో ఈవిడకు అవసరమా..రెడీ అయి ఏం చేస్తుంది అనే వంకర మాటలు చుట్టూ వింటూనే ఉంటాం. మనం బాగా కనిపించాలనుకోవడమనేది ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. దీన్ని ఎవరూ ప్రశ్నించాల్సిన పని లేదు. వయసు పైబడితే ఏమైంది. అందం, ఆరోగ్యం కోసమేగా ఎన్ని చేసినా...సో ఎవరేమన్నా పట్టించుకోవల్సిన పని లేదు.  

వయసుపైబడితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం మూలంగా చర్మం పొడిబారుతుంది. సాగిపోతుంది. ముడతలు పడిపోతుంది. ముఖ్యంగా మెడ, దవడ, కళ్లకింద, బుగ్గలు సాగిపోయినట్లు కనిపిస్తాయి. ఇంక నుదురుపై ముడతలైతే ఇంక చెప్పనక్కర్లేదు. క్లియర్‌కట్‌గా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవల్సిందే.

మోనోపాజ్‌ దశ వచ్చాక శరీరంలో ఎన్నో సమస్యలు బయటపడతాయి. అలాంటప్పుడు చర్మం విషయంలో పరిశుభ్రత చాలా అవసరం. కాబట్టి బయటనుంచి వచ్చే దుమ్ము, ధూళిని పొగొట్టుకునేందుకు ఫేస్‌ప్యాక్‌లువాడాలి. బయటదొరికేవి కాకుండా...హోం రెమిడిస్‌ బెటర్‌. చర్మంలో తేమ తగ్గకుండా చూసుకోవాలి. నిత్యం నీళ్లు తాగుతూనే ఉండాలి. అంతేకాకుండా వయసు పైబడ్డాక ఇంట్లో పనులు, ఒత్తిడితో సతమవుతూ ఉంటారు. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్‌ పొందాలంటే చర్మ సంరక్షణపై శ్రద్ధ పెట్టాల్సిందే.

Best Natural Home Remedies for Glowing Skin | Be Beautiful India

నెలసరి ఆగిపోయాక చర్మం పొడిబారటం ఎక్కువవుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం మంచిది. స్నానం చేసినవెంటనే తడి ఆరకుండా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలి. చర్మ సమస్యలు ఉంటే వైద్యుల సలహా మేరకు క్రీములు వాడాలి.

తరచూ మెడ, దవడలు, ముంజేతులు, కాళ్లకు, చేతులకు మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. ఇంటి పనులు, తోట పని చేస్తున్నప్పుడు చేతులకు గ్లవుజులు ధరించటం మంచిది. అన్నింటికన్నా ముందు తాజా పండ్లు, కూరగాయలు తినాలి. పచ్చి కూరగాయలు తింటే ఇంకా మంచిది. డైరక్ట్‌గా విటమిన్లు లోపలికి వెళ్లి చర్మంలో బ్లడ్‌సెల్స్‌ను యాక్టివేట్‌ చేస్తాయి. అప్పుడు చర్మం మరింత మెరిసిపోతుంది.

ఎన్ని ఎలా వ్యాయామం మానొద్దు. చిన్నచిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇంకో విషయం కంటి నిండా నిద్ర మాత్రం మరిచిపోవద్దు. కాబట్టి రాత్రిపూట 7 నుంచి 9 గంటల సేపు గాఢ నిద్రపోయేలా చూసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.