Health : నిద్రపట్టేందుకు ఆ పని చేస్తున్నారా..? అయితే మీ పని అయిపోయినట్లే..!

Health : నిద్రపట్టేందుకు ఈరోజుల్లో చాలామంది నానా తంటాలు పడుతున్నారు.. రాత్రి ఎంత ట్రై చేసినా ఏవేవో చికాకులు, ఆందోళనల వల్ల నిద్రరావడం లేదు. ఎంతో ట్రై చేస్తే కానీ..ఎప్పటికో నిద్రపోతున్నారు.. అసలు అదేంటో కానీ

Health : నిద్రపట్టేందుకు ఆ పని చేస్తున్నారా..? అయితే మీ పని అయిపోయినట్లే..!


Health : నిద్రపట్టేందుకు ఈరోజుల్లో చాలామంది నానా తంటాలు పడుతున్నారు.. రాత్రి ఎంత ట్రై చేసినా ఏవేవో చికాకులు, ఆందోళనల వల్ల నిద్రరావడం లేదు. ఎంతో ట్రై చేస్తే కానీ..ఎప్పటికో నిద్రపోతున్నారు.. అసలు అదేంటో కానీ.. బెడ్‌ ఎక్కాకే.. మనకు అన్ని ఆలోచనలు వస్తాయి.. ఇక డిప్రషన్లో ఉన్నవాళ్లకు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నిద్రపోకుండా.. గతాన్ని తవ్వుకోని మరీ బాధపడతుంటారు.. ఈ ప్రాసెస్‌లోనే చాలా మంది.. నిద్రకోసం.. నిద్రమాత్రలు వాడుతుంటారు.. ఒక్కసారి వీటికి అలవాటు పడితే.. ఇక రోజు అవే కావాలనిపిస్తుంది. ట్యాబ్లెట్‌ వేస్తే కానీ..మీకు నిద్రరాదు అలా మారిపోతారు.. దీనివల్ల ప్రశాంతమైన నిద్రపడుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే.. కొన్ని గంటలు మాత్రం సోయలేకుండా నిద్రపోతారు. కానీ మీకు తెలియంది ఏంటంటే.. ఈ నిద్రమాత్రలు వాడటం అనేది చాలా ప్రమాదం. మీ గొయ్యి మీరే తొవ్వుకున్నట్లే..! 
Uncomfortable Bed Images – Browse 4,971 Stock Photos, Vectors, and Video |  Adobe Stock
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. దానికి అంతరాయం ఏర్పడితే స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అధిక ఒత్తిడి కారణంగా నిద్ర కరువై నిద్రమాత్రల మీద ఆధారపడతారు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది కానీ అదే పనిగా వీటిని వాడితే మాత్రం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం.. మొదలైన సమస్యలు వస్తాయి. తరచూ స్లీపింగ్‌ పిల్స్‌ వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. 
ResMed అనే స్లీప్ సర్వే 2023 ప్రకారం 58 శాతం మంది భారతీయలు గురక మంచి నిద్రకు సంకేతంగా భావిస్తున్నారు. అంటే గురకపెట్టి నిద్రపోతున్నారు అంటే.. వాళ్లు ఎంతో గాఢ నిద్రలో ఉన్నట్లు మనం ఫీల్‌ అవుతాం.. కానీ ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), ఇతర నిద్ర సంబంధిత సమస్యల లక్షణం. ఈ వ్యాధి వల్ల పగటి నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. 97 శాతం మంది భారతీయులు నిద్ర సమస్యలకు చికిత్స పొందుతున్నప్పుడు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని ఈ పరిశోధనలో వెల్లడించింది.
పడుకునే ముందు ఇలా చేయండి.. 
పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను లేదా స్క్రీన్లను ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. వీటి నుంచి వెలువడే నీలి క్రాంతి నిద్ర-మేల్కోనే చక్రాన్ని నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు వాటిని చూడొద్దు. గది కూడా లైట్లు లేకుండా డిమ్ చేసుకోవాలి. గోరు వచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకాన్ని చదవడం, ధ్యానం చేయడం వంటి పద్ధతులు హాయిగా నిద్రొస్తుంది.
స్లీప్ షెడ్యూల్‌
నిద్ర చక్రం సిర్కాడియన్ రిథమ్‌ సమతుల్యంగా ఉంచేలా చూసుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి.
 
వ్యాయామం
మెదడుని రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళ్లేందుకు ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి ఫాలో అవ్వచ్చు. శారీరక శ్రమ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. రోజూ ఉదయం సమయంలో మీరు వ్యాయామం చేస్తే.. మీ డే యాక్టివ్‌గా ఉంటుంది, రాత్రుళ్లు నిద్ర కూడా త్వరగా పడుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.