world food safety day 2023: ప్లేట్‌ను ఆహారంతో కాదు పోషకాలతో నింపితేనే ఆరోగ్యం..!

ఆహారమే మన జీవనాధారం. వేళకు ఇంత ముద్ద తింటే ఏ గోలా ఉండదు. కానీ మన జిహ్వకు రుచులు ఎక్కువ.. ఏవేవో కావాలి అని కోరుకుంటుంది. అది కోరిన ఫుడ్‌ అంతా మనం తింటే.. రోగాల భారిన పడాల్సిందే. తినడం అంటే కడుపుని మాత్రమే నింపుకోవడం అనుకుంటున్నారు. కాసుల వేటలో పడి కనీస విషయాలు కూడా తెలుసుకోవడం లేదు. దీంతో రోజురోజుకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఏటా జూన్‌ 7 న ఫుడ్‌ సేఫ్టీడే జరుపుకుంటారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారం

world food safety day 2023: ప్లేట్‌ను ఆహారంతో కాదు పోషకాలతో నింపితేనే ఆరోగ్యం..!


ఆహారమే మన జీవనాధారం. వేళకు ఇంత ముద్ద తింటే ఏ గోలా ఉండదు. కానీ మన జిహ్వకు రుచులు ఎక్కువ.. ఏవేవో కావాలి అని కోరుకుంటుంది. అది కోరిన ఫుడ్‌ అంతా మనం తింటే.. రోగాల భారిన పడాల్సిందే. తినడం అంటే కడుపుని మాత్రమే నింపుకోవడం అనుకుంటున్నారు. కాసుల వేటలో పడి కనీస విషయాలు కూడా తెలుసుకోవడం లేదు. దీంతో రోజురోజుకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఏటా జూన్‌ 7 న ఫుడ్‌ సేఫ్టీడే జరుపుకుంటారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారం గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం. 
World Food Safety Day 2021: Theme, History and Significance
 
నేడు చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. ఆఫీస్ పనులు, లేట్ నైట్ వరకూ తీరిక లేని ఒత్తిడులు కారణంగా ఇంట్లో చేసుకునే ఓపిక ఉండదు. దీంతో బయట తినడం, ఒక వేళ ఓపిక సమయం ఉన్నా త్వరగా అయిపోయే పనులను వెతుక్కుంటున్నారు. దీంతో సరైన ఆహారం తీసుకోకుండా అనేక ఆరోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బయట ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల భారిన పడుతుంటారు. ఎవరైతే ఎక్కువగా బయటి ఫుడ్స్‌ తింటారో వాళ్లు త్వరగా లావు అయిపోతారు. రుచిగా ఉండటంతో చాలా ఎక్కువగా తినేస్తారు. ఇంకా ఆ ఆహారాలు తయారుచేసేప్పుడు వాడే పదార్థాలు కూడా నాణ్యమైనవి ఉండవు. ఆ విషయం మీకూ తెలుసు.! దీంతో పౌష్ఠికాహార లోపం తలెత్తడమే కాకుండా, అనారోగ్య సమస్యలు, ఊబకాయం వంటివి పెరిగిపోతున్నాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది బయట తినడానికే ప్రాధాన్యం చూపుతున్నారు. జంక్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నామంటూ తెగ సంబర పడిపోతున్నారు. కానీ, వీటి వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ అధిక బరువు పెరుగుతున్నారని ఆలోచించడం లేదు.
ఈ నేపథ్యంలోనే శుభ్రమైన, సురక్షితమైన ఆహారంపై ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు 2018 నుంచి ఐక్యరాజ్య సమితి జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ రోజున డబ్ల్యూహెచ్‌వో అఫీషియల్ వెబ్‌సైట్ వేదికగా ఆహార భద్రతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీని ద్వారా శుభ్రమైన ఆహారం తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహార ద్వారా కలిగే అనారోగ్య సమస్యలు ఇలాంటి విషయాలను తెలియజేస్తారు.ఈ ఏడాది థీమ్‌ #Food standards save lives. 
డబ్ల్యూహెచ్‌వో 2019 రిపోర్ట్ ప్రకారం, ఏటా కలుషిత ఆహారం కారణంగా 600 మిలియన్ల మంది అనారోగ్య పాలవుతున్నారు. చాలా మంది పిల్లలు కలుషిత ఆహారం కారణంగా మరణిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ బయట తినకపోవడమే మంచిది. వీటితో పాటు నీరు ఎక్కువగా తాగడం, సీజనల్ పండ్లు తీసుకోవడం ముఖ్యం.
ఆరోగ్యం బాగుంటేనే ఏవైనా చేయగలం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉన్న పుడ్స్ తీసుకోవడం, ఆకుకూరలు, పండ్లు, మొలకలు, చిరు ధాన్యాలు ఇలాంటివన్నీ తినడం చాలా మంచిది. వీటితో పాటు పాలు, గుడ్లు, చేపలు వంటివి కూడా తినడం మంచిది. ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని డైట్‌లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల అన్నీ పోషకాలు మనకి అందుతాయి. అయితే ఏవైనా కూడా మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.
మీరు మీ ఆరోగ్యం కోసం రోజులో ఎంత మేర మంచి ఆహారాన్ని తింటున్నారు. బయట ఆహారం అంటే అన్నీ చాక్లెట్స్‌, శీతలపానియాలు కూడా వస్తాయి. ఇవి ఎంత ఉంటున్నాయి. ఒకసారి మీరే ఆలోచించండి. ఇకనైనా బయటి ఆహారాలు తినడం మానేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.