Peace of Mind : మానసిక ప్రశాంతతకు మెరుగైన మార్గాలు...

ఈ విధంగా పలు రకాల ఆలోచనలతో మన మెదడుని నింపడం వల్ల అవసరమైన సమయంలో చురుగ్గా పనిచేయటం మానేస్తుంది అలాగే అన‌వసరమైన విషయాల పైన ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతుంది. అందుకె ఖచ్చితంగా కొన్ని

Peace of Mind  : మానసిక ప్రశాంతతకు మెరుగైన మార్గాలు...
peace of mind


ప్రతిరోజు శరీరాన్ని ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వస్తాము.. బయట దుమ్ము ధూళి నుంచి.. తినే ఆహారం విషయం వరకు ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.. అలాగే శరీరంలో ఉండే మలినాలను కచ్చితంగా బయటికి పంపిస్తాం.. అయితే మన మెదడులో కూడా ఎన్నో రకాల మలినాలు పేరుకు పోతాయని.. వీటిని కచ్చితంగా బయటికి పంపించాలని చెబుతున్నారు మానసిక నిపుణులు..

ఈ విధంగా పలు రకాల ఆలోచనలతో మన మెదడుని నింపడం వల్ల అవసరమైన సమయంలో చురుగ్గా పనిచేయటం మానేస్తుంది అలాగే అన‌వసరమైన విషయాల పైన ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతుంది. అందుకె ఖచ్చితంగా కొన్ని రకాల నియమాలు పాటించాలని దీంతో  Peace of Mind   ల‌భిస్తుంద‌ని  మాన‌సిక నిపుణులు చెబుతున్నారు

మనం రోజు ఆహారం తీసుకుంటాం ఈ ఆహారం శరీరాన్ని నిరంతరం పనిచేసేటట్టు చేస్తుంది. అదేవిధంగా మనం చేసే ఎన్నో ఆలోచనలు మెదడుని ప్రేరేపిస్తాయి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.. అయితే శరీరాన్ని ఎలా డిటాక్సిన్  చేస్తారో అలాగే మెదడులో పేరుకుపోయిన పనికిరాని ఆలోచనలను సైతం అదేవిధంగా దూరం చేసుకోవాలి.. 

కొందరు మనుషులు ఎప్పుడూ ఎదుటివారిని కించపరుస్తూనే ఉంటారు అలాగే సమయం దొరికినప్పుడు హేళన చేయటానికి చూస్తారు ఇలాంటి వారికి దూరంగా ఉండటం అవసరం..

అలాగే కొందరు మిమ్మల్ని టార్గెట్ గా చూపించి ఏదో ఒక రకంగా కిందకు లాగాలని చూస్తారు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. 

కొందరు కావాలనే చెడు వ్యసనాలకు మిమ్మల్ని లోన్ చేయాలని చూస్తారు అంతేకాకుండా అనవసరమైన ఆలోచనలు తలలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు వీరిని ఒక అడుగు దూరంగా ఉంచడం అన్ని విధాల మేలు..

అలాగే ఎప్పటికప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు బాధ కలిగించే మనుషులు ఎవరు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి వీలైతే ఒక పేపర్ పైన రాసుకొని వీరిని మీ మెదడు నుంచి మాత్రమే కాకుండా జీవితం నుంచి కూడా డిలీట్ చేసేయాలి..

అలాగే ఎంత ప్రేమ చూపించిన కొందరు మనుషులు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి వారి కోసం అసలు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవన్నీ ఎంత తొందరగా మరిచిపోయి భవిష్యత్తు కోసం ఆలోచిస్తే అంత మంచిది...

అలాగే ప్రతిరోజు కొంత సమయమైనా వ్యాయామానికి ధ్యానానికి కేటాయించాలి దీని వలన ఏకాగ్రత కుదురుతుంది అనవసరమైన విషయాలు పైన మనసు ఆలోచించదు అలాగే అనవసరమైన ఒత్తిడి దూరమవుతుంది.. 

అలాగే ప్రతి విషయానికి బాధపడుతూ కూర్చోవడం ఎంత మాత్రం మంచిది కాదు జరగబోయే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అలా అని ప్రస్తుతం చేయవలసిన పనులను నిర్లక్ష్యం చేస్తూ మానసిక ఒత్తిడిని పెంచుకునే కన్నా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేస్తూ ప్రశాంతంగా ముందుకు వెళ్లడం ఎంతో మంచిది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.