sleeping on left side : ఎడమ వైపు తిరిగి పడుకునే అలవాటు ఉందా..? అదృష్టవంతులే..!!

Left side తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం మంచిది. దీంతో లివర్‌పై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు.

sleeping on left side : ఎడమ వైపు తిరిగి పడుకునే అలవాటు ఉందా..? అదృష్టవంతులే..!!
Benefits of left side sleeping


Sleeping on Left side ; మనిషికి సరైన నిద్ర చాలా అవసరం.. అలా సరైన విధానంలో పడుకోవడం కూడా అంతే అవసరం.. అర్థంకాలేదా.. ఎలా పడితే అలా పడుకుంటే.. చాలా సమస్యలు వస్తాయి.. మనిషి పడుకునే విధానంబట్టి..వాళ్ల ప్రవర్తను కూడా చెప్పేస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది నిద్ర భంగిమకు.. అయితే  Left side sleeping అలవాటు మీకు ఉంటే ఈ ఆర్టికల్‌ తప్పుకుండా చదివేయండే. Left side తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.. అవేంటంటే..

మన శరీరంలో లింఫాటిక్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే లింఫాటిక్‌ వ్యవస్థలోని ముఖ్యమైన భాగమైన తోరాకిక్‌ డక్ట్‌ ఎడమ వైపు ఉంటుంది.. ఎడమ వైపునకు తిరిగి పడుకుంటే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు మరింత సమర్థవంతంగా బయటకు పోతాయట.. లింఫ్‌ వ్యవస్థ కొవ్వులు, ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన పదార్థాలను కణజాలాలకు చేరవేస్తుంది. ఈ క్రమంలో ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల కణాలు ఆయా పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. అందుకనే ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి.
లింఫ్‌ వ్యవస్థలో స్ల్పీన్‌ అతి పెద్ద అవయవం. ఇది కూడా శరీరంలో ఎడమ భాగంలోనే ఉంటుంది. ఎడమ వైపు పడుకుని నిద్రిస్తే స్ల్పీన్‌ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.. దీని వల్ల స్ల్పీన్‌కు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ క్రమంలో శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.చిన్నపేగుకు, పెద్ద పేగుకు మధ్య ఉండే ఓ జంక్షన్‌ ఎడమ వైపు ఉంటుంది. దీన్నే ఇలియోసికల్‌ వాల్వ్‌ అంటారు. ఎడమ వైపుకు తిరిగి నిద్రించినప్పుడు గురుత్వాకర్షణ బలం వల్ల చిన్నపేగులోని వ్యర్థాలు పెద్ద పేగుకు సులభంగా వెళ్తాయి. దీంతో పెద్ద పేగు నుంచి మలం సులభంగా బయటకు వస్తుంది. దాంతో మలబద్దకం ఉండదు.
గుండెల్లో మంటగా ఉన్నవారు ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తే ఆ సమస్య నుంచి ఉపశమనం లబిస్తుందట..మన శరీరంలో లివర్‌ కుడి వైపు ఉంటుంది కాబట్టి ఆ వైపుకు తిరిగి పడుకుంటే లివర్‌పై భారం పడుతుంది. దీంతో లివర్‌లో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం మంచిది. దీంతో లివర్‌పై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యర్థాలను లివర్‌ సులభంగా బయటకు పంపుతుంది.గుండెకు ఎడమ భాగం ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని శరీరానికి పంపుతుంది. కాబట్టి ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే ఈ పని సులభంగా అవుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సులభంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకునేందుకు ట్రై చేయండి.. ఇప్పటికే ఎడమవైపు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు అదృష్టవంతులనే చెప్పాలి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.