టిఫిన్ మానేస్తున్నారా....అయితే ప్రమాదమే

చాలా మంది 2 పూటల పుష్టిగా తినేసి ఉదయం పూట టిఫిన్ తినడం మానేస్తారు. ఒక పూట తగ్గించేస్తే ఏదో సాధించామని ఫీలయిపోతారు చాలామంది. నెలలో 2, 3 సార్లు అయితే ఓకే, కానీ మితిమీరితే మాత్రం అనర్ధాలు కోరి తెచ్చుకున్నట్లే.

టిఫిన్ మానేస్తున్నారా....అయితే ప్రమాదమే


చాలా మంది 2 పూటల పుష్టిగా తినేసి ఉదయం పూట టిఫిన్ తినడం మానేస్తారు. ఒక పూట తగ్గించేస్తే ఏదో సాధించామని ఫీలయిపోతారు చాలామంది. నెలలో 2, 3 సార్లు అయితే ఓకే, కానీ మితిమీరితే మాత్రం అనర్ధాలు కోరి తెచ్చుకున్నట్లే.

ఒక్క ఉదయం పూట టిఫిన్ మానేస్తే....మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకున్నట్లు. దానివల్ల ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని తగ్గించుకుంటున్నట్టే. గుండెజబ్బుల ముప్పును పెంచుకుంటున్నట్టే.

Tiffin Catering Service | Morning Tiffin Service| Breakfast

అలా అని ఉపవాసాలు మానేయలంటారా అని ప్రశ్నించొచ్చు. అది పెద్ద ప్రమాదమేమి కాదు. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదనే భావన ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతోంది. ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఉపవాసం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రతి విషయంలో నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఒక్కటినీ పాటించాలి. అలా పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఉపవాసం విషయంలో కూడా నియమాలు ఉంటాయి. వాటిని పాటించకపోతే.....ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

ఉపవాసానికీ నాడులు, రోగనిరోధక వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఉపవాసంతో మెదడులో ఒత్తిడి ప్రతిస్పందన తలెత్తటం వల్ల ఆకలితో కూడిన కోపాన్ని ప్రేరేపిస్తున్నట్టూ గుర్తించారు. తెల్ల కణాలు ఉన్నట్టుండి రక్తంలోంచి ఎముకమజ్జలోకి.. తిరిగి మజ్జలోంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే దోహదం చేస్తోందని నిరూపించారు. ఉపవాసంతో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉండటం నిజమే కావచ్చు. కానీ అన్నీ లాభాలే ఉంటాయని అనుకోవటానికి లేదు. శరీర వ్యవస్థల మీద ఉపవాసం ఎలాంటి ప్రభావాలను చూపుతోందనేది లోతుగా అర్థం చేసుకోవటానికి తమ అధ్యయనం తోడ్పడిందని పరిశోధకులు చెబుతున్నారు.

అల్పాహారం మానేయడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉదయం అల్పాహారాన్ని మానేయకూడదు. ఉదయం ఆహారం తీసుకోని వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.


అల్పాహారాన్ని మానేయడం వల్ల మానసికి స్థితిపై ప్రతికూల ప్రభావాలు చూపుతుంది కూడా. అంతేకాదు ఇది రోజువారీ శారీరక శక్తిపై ప్రభావం చూపుతుంది, అంతేకాదు జ్ఞాపకశక్తి మందగించడం, అత్యధిక అలసట రావడం కూడా లక్షణాలే.

అల్పాహారం తీసుకోలేదని....ఒకేసారి మధ్యాహ్నం అధికంగా తినేస్తారు. అది చాలా ప్రమాదం. దానివల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా మెండుగా ఉన్నాయి.

టిఫిన్ స్కిప్ చేస్తే చక్కెర స్థాయిలు భారీగా తగ్గిపోతాయి. మరోవైపు రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. దీంతో మైగ్రేన్, తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒకవేళ టిఫిన్ దాటవేస్తే..ప్రత్యమ్యాయాలు చూసుకోవాలి....దానికోసమే టిప్స్

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.