Baldness in women : మహిళల్లో బట్టతల..  కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ ఇవే.. 

Bald head తో బాధపడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. వీరిలో వెంట్రుకల మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోయి సమస్య తీవ్రతరం అవుతుంది.. అయితే తొలి దశలోనే ఈ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే

Baldness in women : మహిళల్లో బట్టతల..  కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ ఇవే.. 
Causes, symptoms, treatment, prevention for Baldness in women


Bald head పురుషుల్ని సర్వసాధారణంగా వేధించే సమస్య. అయితే ఈ రోజుల్లో మహిళలు కూడా bald head తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. విచిత్రంగా అనిపించిన ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా 45 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా జరిగిన అధ్యయనాలు తెలుపుతున్నాయి.. 

బట్టతలతో బాధపడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. వీరిలో వెంట్రుకల మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోయి సమస్య తీవ్రతరం అవుతుంది.. అయితే తొలి దశలోనే ఈ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.. 

ఈ సమస్యను సకాలంలో ఎలా గుర్తించాలి అంటే.. 

మహిళల్లో బట్టతల తొలుత జట్టు పల్చనవడంతో ప్రారంభమవుతుంది.. రోజు రోజుకి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే కొన్నిచోట్ల దురదగా కూడా అనిపిస్తుంది రాపిడి ఎక్కువ అయితే తలంతా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.. 

అలాగే ఈ బట్ట తలకు ప్రధాన కారణాలు అంటూ ఏవి ఉండవు ఒక్కొక్కరిలో ఒక రకంగా ఇవి ఉంటుంది. ముఖ్యంగా జన్యు పరమైన కారణాలు.. వయసు పెరగడం, శరీరంలో హార్మోన్ల సమతుల్యత వచ్చినప్పుడు, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కావడం, రుతుక్రమం తప్పడం, పాలిసిస్టిక్ అనే అండాశయ సంబంధిత వ్యాధి సోకినప్పుడు.. పలు రకాల కారణాలతో జుట్టు ఊడిపోతూ ఉంటుంది.. అలాగే దీనికి సంబంధించి వైద్యం రెండు రకాలుగా ఉంటుంది కుదుళ్ళు మరి బలహీనంగా ఉంటే అందుకు తగిన విధంగా చికిత్స చేస్తారు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా జరుగుతూ ఉంటే టాబ్లెట్లతో నయం చేస్తారు.. అలాగే లేజర్ థెరపీ, హెయిర్ లాస్ థెరపీ.. ప్లేట్లెట్ ప్లాస్మా థెరపీ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి అయితే ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవన శైలి అన్నిటికంటే ముఖ్యమని చెప్పవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.