అకస్మాత్తుగా గుండె ఆగిపోతే ఏం చేయాలో తెలుసా..!

సాధారణంగా ఈ రోజుల్లో వినిపిస్తున్న అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్.. ఒకప్పుడు చాలా అరుదుగా ఈ కేసులు కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది చిన్న వయసులోనే గుండెపోటుతో

అకస్మాత్తుగా గుండె ఆగిపోతే ఏం చేయాలో తెలుసా..!


సాధారణంగా ఈ రోజుల్లో వినిపిస్తున్న అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్.. ఒకప్పుడు చాలా అరుదుగా ఈ కేసులు కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయమే అయితే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే ఏం చేయాలో తెలుసుకోవడం అత్యవసరం..



సాధారణంగా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. 85% దానికి కారణం గుండె పోటే. అలాగే కొన్నిసార్లు ఇతర గుండె జబ్బులు, ఆక్సిజన్ తగ్గిపోవడం, ఎలక్ట్రిక్ షాక్, పాము కాటు, భయం, లాంటి కారణాలు కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీస్తాయి.

అత్యంత క్లిష్టంగా మారే కార్డియాక్ అరెస్ట్ విషయంలో పక్కనున్న వారు అందించే ప్రధమ చికిత్స అత్యవసరం.
ఆ చికిత్సను కార్డియోపల్మనరీ రెససిటేషన్ (సీపీఆర్) అంటారు.

సాధారణంగా మనిషి గుండె కొట్టుకోవాల్సిన వేగం నిమిషానికి 60- 100 సార్లు ఉంటుంది. అయితే, గుండె కొట్టుకునే వ్యవస్థ (కండక్టింగ్ సిస్టమ్)లో లోపం వల్ల గుండె వేగం పెరగడం, తగ్గడం, లేక ఒక్క సారిగా గుండె ఆగిపోవడం జరుగుతుంది. ఎవరికైనా అకస్మాత్తుగా గుండె ఆగిపోతే, పక్కన ఉండేవారు దాన్ని మళ్ళీ కొట్టుకునే లాగా చేయవచ్చు. ఎవరైనా స్పృహ కోల్పోయి కనిపిస్తే, ముందుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, రెండు భుజాలను పట్టుకొని ఊపుతూ, తనను లేపే ప్రయత్నం చేయాలి. అప్పటికీ లేవకపోతే, తన గొంతుకు ఏదైనా ఒక పక్క చేతి వేళ్లతో పల్స్ కోసం చూడాలి. అది తెలియక పోతే, ఊపిరి తీసుకుంటున్నారా లేదా అని గమనించాలి.



ఊపిరి తీసుకోవడం లేదు అని నిర్ధారణ అయితే, అప్పుడు వెంటనే ఎవరినైనా సహాయానికి పిలవడం, లేక దగ్గర్లో ఉండే వారికి, లేక 108కి ఫోన్ చేయాలి. తరవాత ఆ వ్యక్తికి సరిగ్గా గాలి ఆడేలాగా చూస్తూ, బట్టలు ఏమైనా బిగుతుగా ఉంటే వదులుగా చేయాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి రొమ్ము మధ్య ఎముక (స్టానమ్) కింద భాగంలో ఒక చేతి మీద ఒక చెయ్యి పెట్టి, వేళ్ళ మధ్య వేళ్ళను పెట్టి మొత్తం మన శరీరం బరువు మొత్తం పడేలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు చాతి మీద ఒత్తిడి కలిగించాలి. ప్రతి సారీ 2-2.5 అంగుళాలు లోపలికి, లేక ఛాతిలో మూడవ వంతు లోపలికి వెళ్ళి వచ్చేలాగా నొక్కాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఆ వ్యక్తి పక్కటెముకల మీద బలం పడకుండా చూసుకోవాలి లేదంటే అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.