Benefits of Fasting ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Benefits of Fasting : ఉపవాసం చేస్తే నీరసం, శక్తి తగ్గుతుందని అందరూ అనుకుంటారు. అలా అనుకోవడం పొరపాటే. పైపెచ్చు దానివల్ల శరీరంలో విషపదార్థాలు తొలగిపోతాయి. చురుకుదనం, ఉత్సాహం రెట్టింపవుతుంది. ఉపవాసం వల్ల

Benefits of Fasting ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Benefits of Fasting


Benefits of Fasting : ఉపవాసమని కొట్టిపారేయకండి..... మానవదేహానికి ఉపవాసం వల్ల కలిగే లాభాలు అనంతం.

మన దేశం...... భిన్న సంస్కృతలతో కూడుకున్నది. ప్రతి సంస్కారానికి ఒక నియమం, నిబంధన ఉంటుంది. అలాగే ఏ మతమైనా, ఏ కులమైనా ప్రార్థించేది భగవంతుడినే. అయితే ఏ వర్గమైనా దేవుడికి ఉపవాసంతోనే భక్తిని చాటుకుంటారు. తమకు అనుకూలమైన రోజుల్లో ఉపవాసం ఉంటుంటారు. దేవుడి కోసం ఉపవాస దీక్షలు, ఒంటిపూట భోజనాలు చేస్తూ ఉంటారు. 

పెద్దవాళ్లు పెట్టిన ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆంతర్యం ఉంటుంది. అలాగే ఉపవాసం వెనుక కూడా బోలెడన్నీ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఈ ఉపవాసం సంస్కృతి వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. 

అయితే కొందరు మోక్షం కోసం ఉపవాసాలు చేస్తే.... మరికొందరు బరువు తగ్గడానికి, నాజుగ్గా తయారవ్వడానికి చేస్తుంటారు. పేరు ఏదైనా కావచ్చు..... లాభాలు మాత్రం అనేకం. 

ఉపవాసం చేస్తే నీరసం, శక్తి తగ్గుతుందని అందరూ అనుకుంటారు. అలా అనుకోవడం పొరపాటే. పైపెచ్చు దానివల్ల శరీరంలో విషపదార్థాలు తొలగిపోతాయి. చురుకుదనం, ఉత్సాహం రెట్టింపవుతుంది. ఉపవాసం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

అసలు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. 

  • ఉపవాసం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
  • శరీరంలో ఉండే కొలస్ట్రాల్ స్థాయి తగ్గడానికి దోహదపడుతుంది
  • అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చక్కెరలు, విషపదార్థాలు కరిగి బయటకు వచ్చేస్తాయి.
  • టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉపయోగపడుతుంది
  • గుండెపోటు, రక్తపోటు రాకుండా ఉంటాయి.
  • ఉపవాస దీక్ష చేయడం వల్ల నెలరోజుల పాటు నిష్టగా ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండొచ్చు.
  • నెలరోజులు ఉపవాస దీక్ష చేసేవాళ్లు పళ్లు, సలాడ్, పళ్లరసాలు తింటే.....శరీరం నిరసానికి గురికాకుండా ఉంటుంది.
  • ఉపవాసం రోజు చేయడం కంటే వారానికొకసారి చేస్తే మరీ మంచిది.
  • కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి.శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది.
  • బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉపవాసం చేస్తే మంచిది. దానివల్ల ఆహార అలవాట్లు , జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. కొవ్వు కూడా
  • కరుగుతుంది. బరువు సైతం తగ్గుతారు.
  • హార్మోన్లు, కణాలు, జన్యువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. 

ఉపవాసం అంటే అమ్మకో, నాన్నకో భయపడి చేయడం కాదు.. దానిపై సరైన అవగాహన ఉంటే. దాని ప్రయోజనమెంటో తెలుస్తుంది.
ఏ పద్ధతిలోనైనా అతి పనికిరాదని గుర్తుంచుకోవాలి. మితిమీరి చేస్తే ఆనారోగ్యానికి గురవ్వడం తప్పనిసరి....జాగ్రత్త మిత్రమా.... 
అదే విధంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకుని తదనుగుణంగా నడుచుకోవాలి. మన శరీరం దానిని తట్టుకోగలదా లేదా అని తెలుసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.