ప్రధానంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇవే.. 

వయసు పెరుగుతున్న కొలది కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది అందులో ముఖ్యంగా కళ్ళు మసకబారటం సమస్య వేధిస్తుంది అయితే పెద్ద వయసులో రావాల్సిన ఈ సమస్య ఈ రోజుల్లో చిన్నపిల్లల సైతం కనిపించడం ఆందోళన కలిగించే విషయమే.

ప్రధానంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇవే.. 


వయసు పెరుగుతున్న కొలది కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది అందులో ముఖ్యంగా కళ్ళు మసకబారటం సమస్య వేధిస్తుంది అయితే పెద్ద వయసులో రావాల్సిన ఈ సమస్య ఈ రోజుల్లో చిన్నపిల్లల సైతం కనిపించడం ఆందోళన కలిగించే విషయమే. దృష్టి ఆగిపోతే, తగ్గడం ప్రారంభిస్తే, ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలి. అందుకే కళ్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కంటికి సంబంధించిన పలు రకాల వ్యాధులు సైతం కంటి చూపున తగ్గిస్తాయి అందులో ముఖ్యంగా ఆస్టిగ్మాటిజం.. అస్టిగ్మాటిజం అనేది దృష్టి అస్పష్టతకు కారణమయ్యే ఒక సాధారణ కంటి పరిస్థితి. కంటి లోపల సక్రమంగా వక్ర ఆకారంలో ఉన్న కార్నియా లేదా లెన్స్ కారణంగా ఇది సంభవిస్తుంది, ఇది కాంతిని రెటీనాపై సరిగ్గా దృష్టి పెట్టకుండా నిరోధిస్తుంది. దీనివలన కంటి చూపు మందగిస్తుంది. 
మయోపియా..  ఇది ఒక సాధారణ కంటి పరిస్థితి.. దీనిలో దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడవచ్చు, కాని దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. మయోపియా ఉన్నవారు టెలివిజన్ చూసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు విషయాలు స్పష్టంగా చూడటంలో ఇబ్బంది కలిగి ఉంటారు.
గ్లకోమా, రెటీనాకు సంబంధించిన పలు రకాల సమస్యలు వంశపారపర్యం వంటివి సైతం కంటి చూపును దెబ్బతీస్తాయి. 
డయాబెటిస్ మెల్లిటస్.. డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారు వారి దృష్టిలో మార్పులను తేలికగా గుర్తించవచ్చు ఈ సమస్య ఉన్నవారికి చూపు అస్పష్టంగా ఉంటుంది.
కాగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలు తప్పనిసరి.. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి పాలకూర బొప్పాయి క్యారెట్ వంటి వాటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఎండాకాలంలో అతి నీల లోహిత కిరణాలు కంటిని తాకకుండా జాగ్రత్తపడాలి. బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి..
విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యంతో జాగ్రత్త పడాలి. దుమ్ము దులిలో తిరిగినప్పుడు కంటిని రక్షించుకోవడం అత్యవసరం. అలాగే కంటికి సంబంధించిన సౌందర్య సాధనాలు వాడే విషయంలో సైతం తగిన జాగ్రత్త పాటించాలి. 
వంశపారపర్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం ముఖ్యంగా రే చీకటి, రిటీనాకు సంబంధించిన సమస్యలు చిన్న వయసులోనే చూపుకోల్పోవటం వంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.