అకస్మాత్తుగా వచ్చే మరణాన్ని తగ్గించుకోవాలా?

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. అకస్మాత్తుగా కొన్నిసార్లు గుండెకు సంబంధించిన సమస్యలు శరీరంలో అనుకోని మార్పులు జరిగినప్పుడు సైతం మరణం సంభవిస్తుంది. అయితే కొన్నిసార్లు అయినా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అంటే వ్యాయామం తప్పనిసరి అని ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆరోగ్య నిపుణులు. అయితే ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోవట్లేదు

అకస్మాత్తుగా వచ్చే మరణాన్ని తగ్గించుకోవాలా?


మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. అకస్మాత్తుగా కొన్నిసార్లు గుండెకు సంబంధించిన సమస్యలు శరీరంలో అనుకోని మార్పులు జరిగినప్పుడు సైతం మరణం సంభవిస్తుంది. అయితే కొన్నిసార్లు అయినా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అంటే వ్యాయామం తప్పనిసరి అని ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆరోగ్య నిపుణులు. అయితే ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోవట్లేదు కానీ ఆరోగ్యంగా ఫీట్ గా ఉండాలి అంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. అందులో నడక అత్యంత ముఖ్యమైన విషయం.
770+ Dead Body On Floor Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock
రోజు కచ్చితంగా 10000 అడుగులు నడవాల్సిందే అంటూ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే 5000 కన్నా తక్కువ అడుగులు వేసిన ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తోంది. ఎంత సమయం లేనివాళ్ళైనా కనీసం 4000 అడుగులు నడిస్తే ఆకస్మాత్తుగా సంభవించే మరణాన్ని తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. 
గుండెకి సంబంధించిన పలు రకాల వ్యాధులు దరిచేరకుండా ఉండాలి అంటే రక్తనాళాల్లో పెరిగిపోయిన కొవ్వును కరిగించాల్సిందే. ఇందుకు రోజు ఖచ్చితంగా కాస్త సమయం శరీరాన్ని కష్టపెట్టాల్సిందే.
నడక రోజున ఉత్సాహంగా మారుస్తుంది. ఎన్నోరకాల అనారోగ్య సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. అయితే నడుపుతో పాటు డైట్, జీవనశైలి కూడా ఎంత ముఖ్యమైన విషయమే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న జీవితకాలం పెంచుకోవాలన్న ఇవన్నీ తప్పనిసరి. నిజానికి ఎక్కువ సమయం ఏ పని చేయకుండా కూర్చోవడం వల్లే పలు రకాల సమస్యలు వస్తాయి. ఇది జీవక్రియ వేగాన్ని తగ్గించవచ్చు. కండరాల వృద్ధి, సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కండరాల నొప్పులు కలుగుతాయి.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇలాంటి వారిలో వెన్నుముక కుంచించుకు పోయే పరిస్థితి సైతం ఏర్పడుతుంది ఒత్తిడి సైతం ఇది దారితీస్తుంది. 
నడక వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఎముకలకు రక్షణగా ఉండే కండరాలు శక్తిమంతం అవుతాయి. ఎనర్జీ స్థాయులు పెరుగుతాయి. ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.