కూల్‌ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే 

బయటి తినే ఆహారాలు, తాగే పానియాలు ఏది మన ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్న చిన్న పిల్లలు..ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. వాళ్లను అలా చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ వయసు నుంచే వారికి ఆ ఐస్‌క్రీమ్స్‌

కూల్‌ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే 


బయటి తినే ఆహారాలు, తాగే పానియాలు ఏది మన ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్న చిన్న పిల్లలు..ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. వాళ్లను అలా చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ వయసు నుంచే వారికి ఆ ఐస్‌క్రీమ్స్‌, బర్గర్స్‌, పిజ్జాలు, చాకోలు, లేస్‌లు అని ఏది పడితే అది పెడితే.. వారి ఆరోగ్యం ఎంత పాడవుతుందో మీరు ఆలోచించారా..? బిర్యానీ తింటూ కూల్‌డ్రింగ్‌ ఆర్డర్‌ చేస్తారు. తాగేప్పుడు సమ్మగానే ఉంటుంది. కానీ కూల్‌డ్రింక్స్‌ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..? ఏం వస్తాయ్‌ అండీ..మహా అయితే జలుబు చేస్తుంది అంటారేమో..? మీ ఊహకు కూడా అందని రోగాల భారిన పడతారు. అవి కూల్‌డ్రింక్స్ కాదు.. కూల్‌గా చంపే డ్రింక్స్‌.   
Pepsi Black Soft Drinks, Liquid, Packaging Type: Carton
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారు అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకు కారణం కూల్ డ్రింక్స్‌లో తీపి రుచి కోసం అధిక మోతాదులో చక్కర వినియోగించడమే. ఎంత ఎక్కువ స్వీట్ కంటెంట్ తీసుకుంటే అంత ఎక్కువ బరువు పెరగడం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వారు అధిక బరువు పెరగడం ఖాయం.
అధికంగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో రోగ నిరోధక శక్తి కూడా నశిస్తుంది అని అనేక అధ్యయనాల్లో తేలింది. కూల్ డ్రింక్స్‌లో ఉండే హానికరమైన పదార్థాలు, రసాయనాలే అందుకు కారణం అని న్యూట్రిషనల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్‌లోనూ కెఫైన్ ఉంటుంది. తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే మెదడును ఉత్తేజితం చేసే ఇదే కెఫైన్‌ రెగ్యులర్‌గా కానీ లేదా అధిక మోతాదులో కానీ తీసుకునే వారిలో తలనొప్పికి దారి తీస్తుంది. 
 
ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సాధారణంగా పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అలాంటిది కూల్‌డ్రింక్స్‌ తాగితే పొట్ట ఉబ్బరం ఏంట్రా అని డౌట్‌ రావొచ్చు.. కిక్ ఇవ్వడం కోసం ఉపయోగించే గ్యాస్‌తో పాటు ఆ డ్రింకుని ప్రిజర్వ్ చేయడం కోసం ఉపయోగించే కెమికల్స్ వినియోగం వల్ల కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగాకా పొట్టలో ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి అది పొట్టలో మంటగానూ అనిపించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. 
కూల్ డ్రింక్స్ తాగితే దంతాలు పుచ్చిపోతాయి. కూల్ డ్రింక్స్ తాగేవారిలో పుప్పి పళ్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. 
 
రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తాగేవారికి గుండెలో మంటగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కిందకే వస్తాయి. మీకు అంతగా కూల్‌గా ఏదైనా తాగాలి అనిపిస్తే.. ఫ్రూట్‌జ్యూస్‌లు చేసుకోని తాగండి. ఎందుకండీ చేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకంటారు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.