పిరియడ్స్‌ టైమ్‌కు రావాలంటే ఈ ఆయుర్వేద చిట్కాను ట్రై చేయండి

అమ్మాయిలకే అన్నీ సమస్యలు. అటు మానసికంగా, ఇటు శారీరకంగా చాలా కుంగిపోతుంటారు. ఈ పిరియడ్స్‌ వల్ల ఎప్పుడూ ఏదో ఒక లొల్లి ఉంటుంది కదా. అయితే కరెక్టుగా టైమ్‌కు రావ, లేకపోతే నెలకు రెండు సార్లు వస్తాయి, బ్లీడింగ్‌ అవదు, కొంతమందికి ఓవర్‌ బ్లీడింగ్‌, పెయిన్‌ అబ్బో అది అంతా అరాచకం. చాలా మంది అమ్మాయిలకు

పిరియడ్స్‌ టైమ్‌కు రావాలంటే ఈ ఆయుర్వేద చిట్కాను ట్రై చేయండి


అమ్మాయిలకే అన్నీ సమస్యలు. అటు మానసికంగా, ఇటు శారీరకంగా చాలా కుంగిపోతుంటారు. ఈ పిరియడ్స్‌ వల్ల ఎప్పుడూ ఏదో ఒక లొల్లి ఉంటుంది కదా. అయితే కరెక్టుగా టైమ్‌కు రావ, లేకపోతే నెలకు రెండు సార్లు వస్తాయి, బ్లీడింగ్‌ అవదు, కొంతమందికి ఓవర్‌ బ్లీడింగ్‌, పెయిన్‌ అబ్బో అది అంతా అరాచకం. చాలా మంది అమ్మాయిలకు రెండు మూడు నెలలకు ఒకసారి పిరియడ్స్‌ వస్తాయి. అలాగే ర‌క్త‌స్రావం క‌నీసం 5 రోజుల పాటు కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా నెల‌స‌రి 21 రోజుల నుండి 40 రోజుల మ‌ధ్య‌లో వ‌స్తుంది. అలాగే 5 నుండి 7 రోజుల పాటు ర‌క్త‌స్రావం అవుతుంది. 

అయితే నేటి త‌రుణంలో నెల‌స‌రి స‌క్ర‌మంగా రాక‌పోవ‌డంతో పాటు ర‌క్త‌స్రావం కూడా త‌క్కువ‌గా అవుతుంది. నెల‌స‌రి స‌క్ర‌మంగా రాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, అధిక బ‌రువు, థైరాయిడ్, పిసిఒడి, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి వివిధ కార‌ణాల చేత బ‌హిష్టు ఆల‌స్యంగా వ‌స్తుంది. నెలసరే ఒక సమస్య అంటే దీనివల్ల సంతానం మీద కూడా ప్రభావం ఉండటం మరో సమస్య. ఒక ఆయుర్వేద చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ప్ర‌తినెల బ‌హిష్టు స‌క్ర‌మంగా వ‌స్తుంది. ఈ చిట్కాను పాటించ‌డం కూడా చాలా సుల‌భం.
దీని కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర చెక్క నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత అందులో చిటికెడు ప‌సుపు, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. అందులో ఒక ట‌మాట నుండి తీసిన ర‌సాన్ని వేసి క‌ల‌పండి. ఇలా త‌యారుచేసుకున్న నీటిని రోజూ రాత్రి ప‌డుకునే ముందు తాగాలి. ఇలా ఈ నీటిని తాగుతూనే కొద్దిగా బెల్లాన్ని తినాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌హిష్టు ప్ర‌తినెలా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎన్నో రోజుల నుంచి ఆగిన బ‌హిష్టు కూడా 3 నుండి 4 రోజుల్లో వ‌స్తుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌క్ర‌మంగా వ‌స్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.