రోజంతా ఉత్సాహంగా ఉండాలా.. ఇలా ట్రై చేయండి.. 

రోజంతా ఉత్సాహం గా ఉండాలి అంటే తప్పకుండా నిత్యజీవితంలో కొన్ని నియమాలు పాటించాల్సిందేనని తెలుస్తోంది.. అందులో ముఖ్యంగా మన రోజువారి అలవాట్లను మార్చుకోవాలి.. 

రోజంతా  ఉత్సాహంగా ఉండాలా.. ఇలా ట్రై చేయండి.. 
Try this to be more active all the day


 రోజంతా ఉత్సాహంగా ఉండాలి అంటే తప్పకుండా నిత్యజీవితంలో కొన్ని నియమాలు పాటించాల్సిందేనని తెలుస్తోంది.. అందులో ముఖ్యంగా మన రోజువారి అలవాట్లను మార్చుకోవాలి.. జీవితంలో కొంచెం క్రమశిక్షణగా ఉంటే జరగాల్సిన అద్భుతాలు అవే జరిగిపోతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

నిద్ర లేస్తూనే ఉత్సాహంగా ఉండటం వల్ల ఆ రోజంతా ఎంత ఉత్సాహంగా గడుస్తోంది. అందుకే లేవగానే ఎలాంటి చిరాకులు దరి చేరనివ్వకూడదు. అలాగే ముఖ్యంగా చాలా మందికి నిద్ర లేస్తూనే ఫోన్ చూసి అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల వచ్చే నోటిఫికేషన్ చూస్తూ రిప్లైలు ఇస్తూ ఎక్కువ సమయం తెలియకుండానే ఫోన్ తో గడిచిపోయి చేయవలసిన పనులు వాయిదా వేస్తూ ఉంటారు. దీనివల్ల తెలియకుండానే సమయం గడిచిపోతుంది తర్వాత చేయాల్సిన పనులన్నీ ఒకదానికొకటి వాయిదా పడతాయి.

అల్పాహారం తినాల్సిన సమయం ఆఫీస్ కి వెళ్లాల్సిన సమయం వంటివి తెలియకుండానే ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తాయి ఇదంతా రోజు గడిచే విధానం మీద ప్రభావం చూపించి మనసంతా చికాకుగా మారుతుంది అందుకే నిద్రలేచిన వెంటనే ఫోన్ తో గడపకుండా కాసేపు బయట వాతావరణం లో తిరగటం కాసేపైనా వ్యాయామానికి కేటాయించడం వంటి పనులు చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది..

అలాగే చాలామందికి రాత్రి లేటుగా నిద్రపోయి తెలవారి లేటుగా నిద్ర లేచే అలవాటు ఉంటుంది. ఇలా కాకుండా కచ్చితంగా ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటే ఆ రోజంతా చేయవలసిన పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా సమయానికి అన్ని పనులు పూర్తయితే మనలో మనకే కాన్ఫిడెన్స్ మొదలవుతుంది. వారంలో కచ్చితంగా నాలుగు రోజులైనా వ్యాయామానికి కేటాయించాలి. అలాగే వీలైతే నడక పరుగు వంటివి కూడా చేయడం వల్ల లాభాలు ఉంటాయి.. నిద్రలేచిన వెంటనే నాలుగు గోడలు వదిలి బయట ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి అలాగే తగిన పోషకాలు ఇందులో ఉండేలా చూసుకోవడం వల్ల రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.. అల్పాహారంలో రాగిజావ గుడ్డు వంటివి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.