Hole in the Heart : పసిపిల్లల్లో గుండెకు రంధ్ధ్రం ఉందని ఎలా కనిపెట్టాలంటే.. 

ఈ రోజుల్లో పసిపిల్లలకు వచ్చే జబ్బుల్లో గుండెకు రంధ్రం( Hole in the Heart ) ఉండటం కూడా ఒకటి అయితే ప్రపంచవ్యాప్తంగా పుట్టే వెయ్యమంది పిల్లల్లో 8 నుంచి 10 మందికి ఈ సమస్య ఉంటుంది

Hole in the Heart :  పసిపిల్లల్లో గుండెకు రంధ్ధ్రం ఉందని ఎలా కనిపెట్టాలంటే.. 
heart attack


ఈరోజుల్లో పసిపిల్లలకు వచ్చే జబ్బుల్లో గుండెకు రంధ్రంHole in the Heart  ఉండటం కూడా ఒకటి అయితే ప్రపంచవ్యాప్తంగా పుట్టే వెయ్యమంది పిల్లల్లో 8 నుంచి 10 మందికి ఈ సమస్య ఉంటుంది చాలా వరకు  వరకు నవజాత శిశువులు మరణించడానికి కూడా కారణం గుండె సంబంధిత సమస్యలు ఉండటమే అయితే గుండెకు రంధ్రం ఉండటానికి పలు కారణాలు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో గుర్తిస్తే తగిన చికిత్స అందించవచ్చు.. 

ముఖ్యంగా మేనరిక వివాహాలు, గర్భంతో ఉన్నప్పుడు అధిక ఒత్తిడికి గురవటం క్రోమోజోముల సంఖ్య ధూమపానం మధ్యపానం పెద్ద వయసులో గర్భం దాల్చడం వంటి ఎన్నో కారణాలతో పొట్టే బిడ్డలు ఈ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ముందుగా కనిపెట్టాలి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ.. ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నా.. 
పుట్టిన 5 - 10 నిముషాల తర్వాత కూడా బిడ్డ గులాబీ రంగులోకి మారకుండా నీలి రంగులో ఉన్నా.. అలాగే 
నాడి తెలియకుండా పాలిపోయినట్లు ఉన్నా.. 

ఆక్సిజన్ అందించినా ఆక్సీమీటర్లో శాచురేషన్ పెరగకపోవడం వంటివి ఉంటే బిడ్డ గుండెజబ్బుతో ఉందేమోనని అనుమానించాలి. అలాగే వెంటనే 2డి ఎకో చేసి నిర్ధారణ చేసుకోవాలి. ప్రతీ గుండె జబ్బునూ స్టెతస్కోపుతో చూసి గుర్తించలేము అనే విషయం తెలుసుకోవాలి.. అప్పుడే పుట్టిన బిడ్డల్లో అయితే స్టెతస్కోపుతో ఎసైనోటిక్ గుండె జబ్బులను గుర్తించటం మరీ కష్టం. 

అలాగే నెలల వయసు ఉన్న పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే.. బిడ్డ సాధారణ స్థాయికి మించి ఊపిరి తీసుకోవడానికి ఆరాటపడుతుంతాడు.. అలాగే పాలు తాగే మధ్య మధ్యలో రొమ్ము వదిలేసి ఊపిరి బలంగా తీసుకున్నా.. 
తలపై ఎక్కువగా చెమటలు పట్టినా.. అరిచేతులు, అరికాళ్ళు ఎప్పుడూ చల్లగా, చమట పట్టినట్లు ఉన్నా.. 
బరువు పెరగకపోయినా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చినా.. ఫిట్స్ వచ్చినా  ఆలస్యం చేయకుండా గుండెకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్న ఏమో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.