Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. సోయాబీన్స్‌ తినాల్సిందే..!!

సోయాబీన్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ముఖ్యంగా ఆడవారి పిరియడ్‌ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం అనే చెప్పాలి. సోయాబీన్స్‌ ఎలా వాడుకున్నా.. మహిళలకు కావాల్సిన హార్మోన్స్‌ అన్ని అందుతాయి సోయాబీన్స్‌లోని ప్రోటీన్స్ను Bad Cholesterol తగ్గించగలదని శాస్తవేత్తలు వెల్లడించారు. Bad Cholesterol వల్లే గుండె జబ్బులు వస్తాయి.

Bad Cholesterol  : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. సోయాబీన్స్‌ తినాల్సిందే..!!
Bad Cholesterol


సోయాబీన్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ముఖ్యంగా ఆడవారి పిరియడ్‌ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం అనే చెప్పాలి. సోయాబీన్స్‌ ఎలా వాడుకున్నా.. మహిళలకు కావాల్సిన హార్మోన్స్‌ అన్ని అందుతాయి.. ఈస్ట్రోజన్‌ లోపం భర్తీ అవుతుంది. సోయాబీన్స్‌లోని ప్రోటీన్స్ Bad Cholesterol ను తగ్గించగలదని శాస్తవేత్తలు వెల్లడించారు. Bad Cholesterol  వల్లే గుండె జబ్బులు వస్తాయి. అధిక బరువుకు కూడా ఇదే కారణం.. 

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం.. ప్రోటీన్ బి కాంగ్లిసినిన్‌లో పుష్కలంగా ఉన్న సోయా పిండిని తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అథెరోస్క్లెరోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు తెలిపారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే.. ఇది ధమనుల గోడలను మూసివేసి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సోయా ఆధారిత ఆహారాలు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇవి మాంసం కంటే తక్కువ సంతృప్త కొవ్వుని కలిగి ఉంటాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందిస్తుంది.

 సోయా పాలతో కూడా.

శాఖాహారులకు ఇది చక్కని ఎంపిక. సోయాతో చేసిన టోఫు ప్రాసెస్ చేసిన మాంసాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించువచ్చు. సాధారణ పాలకు బదులుగా సోయా పాలు, పెరుగు తీసుకోవచ్చు.. సోయాతో చేసిన సాస్ కూడా తీసుకోవచ్చు. ఇది సోయా బీన్స్‌తో చేస్తారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉండదు. కాకపోతే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కానీ సోయాతో చేసిన ఆహారం తీసుకోవాలంటే మాత్రం ముందుగా వైద్యుని సంప్రదించాలి.. మీ ఆరోగ్య స్థితిని బట్టి ఎంతమేరకు వాడాలో చెప్తారు. సోయా పాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచి హృదయనాళ వ్యవస్థ బాగుండెలా చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. బోలు ఎముకల వ్యాధిని రాకుండా అడ్డుకుంటుంది

 సోయాబీన్ వల్ల ప్రయోజనాలు..

 సోయా బీన్స్, సోయా ఆహారాలు హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

రక్తపోటు తగ్గిస్తుంది. 

అభిజ్ఞా క్షీణత నుంచి బయట పడొచ్చు. 

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి 30 నుంచి 50 mg ఐసోఫ్లేవోన్‌లు సరిపోతాయి..ఇవి సోయా ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటాయి.. మీరు సోయాను బీన్స్‌ రూపంలోనూ, సోయా పిండిద్వారా, పాల ద్వారా, పెరుగు ద్వారా, సాస్‌ ద్వారా ఎలా తీసుకున్నా..మీకు కావాల్సిన ఐసోఫ్లేవోన్లు అందుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.