Beauty : ఇవి రెండు తిన్నారంటే.. ఊడిన జుట్టు అంతా వచ్చేస్తుంది..!

Beauty : ఊడిపోయే జుట్టు పారిపోయే ఆరోగ్యానికి సంకేతం.. ఒక వ్యక్తికి ఎంత జుట్టు ఊడుతుందో.. ఆ వ్యక్తి ఆరోగ్యం అంత దెబ్బతింటుంది. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దానికోసం పెట్టని ఆయిల్‌ ఉండదు.

Beauty : ఇవి రెండు తిన్నారంటే.. ఊడిన జుట్టు అంతా వచ్చేస్తుంది..!


Beauty : ఊడిపోయే జుట్టు పారిపోయే ఆరోగ్యానికి సంకేతం.. ఒక వ్యక్తికి ఎంత జుట్టు ఊడుతుందో.. ఆ వ్యక్తి ఆరోగ్యం అంత దెబ్బతింటుంది. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దానికోసం పెట్టని ఆయిల్‌ ఉండదు.. పూయని మాస్క్‌ ఉండదు.. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డానికి, బ‌ట్ట త‌ల రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒకసారి బట్టతల వచ్చిందంటే..ఇక ఎన్ని అనుకున్నా ఏం లాభం ఉండదు. 

మ‌నం సాధ్య‌మైనంత వ‌ర‌కు జుట్టు రాల‌కుండా, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వ‌చ్చేలా చూసుకోవాలి. జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో చుండ్రు కూడా ఒక‌టి. చుండ్రు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. అలాగే పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ చాలా మంది పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. 

త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు మ‌న వేళ్ల‌తో మాడును బాగా రుద్దాలి. అలాగే ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే చుండ్రు స‌మ‌స్య నుంచి మ‌నకు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 

మ‌నం స్నానం ఎలా అయితే ప్ర‌తిరోజూ చేస్తామో త‌ల‌స్నానం కూడా అలాగే ప్ర‌తిరోజూ చేయాలి. దీంతో బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్‌లు రాకుండా ఉంటాయి. 

జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. 

ఇక జుట్టు బాగా రావాలంటే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒక‌టి. ఈ సోయాబీన్స్‌ను 12 గంట‌ల పాటు నాన‌బెట్టి మ‌నం రోజూ తయారు చేసే వంట‌ల్లో వేసి తీసుకోవ‌చ్చు. 

మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ ల‌భిస్తాయి. త‌గిన‌న్ని ప్రోటీన్స్ అంద‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా వ‌స్తుంది. మొల‌కెత్తిన విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

సోయా బీన్స్‌ను తిన‌లేని వారు ఈ మొలకెత్తిన విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. 

ఇవి మీ డైట్‌లో భాగం చేసుకున్నారంటే.. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుక‌లు వ‌స్తాయి. ఈ విధంగా ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేస్తూ, మొల‌కెత్తిన విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.