Cold and allergy : జలుబు, ఎలర్జీ ఒక్కటి కాదు సుమా.. తేడా గుర్తుంచకపోతే ప్రమాదం తప్పదు..

Cold and allergy : శ్వాసకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా జలుబుగానే భావిస్తారు. రెండు రోజుల్లో తగ్గిపోతుందని అజాగ్రత్త వహిస్తారు. కానీ ఇలా వచ్చే ప్రతి సమస్య జలుబు మాత్రమే కాదు. కొన్నిసార్లు బయటికి కనిపించని ఎలర్జీ సైతం దాడి చేస్తూ ఉంటుంది.

Cold and allergy : జలుబు, ఎలర్జీ ఒక్కటి కాదు సుమా.. తేడా గుర్తుంచకపోతే ప్రమాదం తప్పదు..
Cold and allergy are not the same


Cold and allergy : శ్వాసకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా జలుబుగానే భావిస్తారు. రెండు రోజుల్లో తగ్గిపోతుందని అజాగ్రత్త వహిస్తారు. కానీ ఇలా వచ్చే ప్రతి సమస్య జలుబు మాత్రమే కాదు. కొన్నిసార్లు బయటికి కనిపించని ఎలర్జీ సైతం దాడి చేస్తూ ఉంటుంది. వాటిని ముందుగానే గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఆకస్మాత్తుగా గొంతులో ఏదో తేడా కనిపిస్తూ ఉంటుంది. గరగరగా అనిపిస్తుంది. ముక్కు నుంచి నీరు కారటం, జలుబు ప్రారంభమవుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. ఆయాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ శరీరంపై ఎలర్జీ దాడి చేసిందని చెప్పే లక్షణాలు.

ఈ భూమి మీద మనుషులు మాత్రమే కాకుండా ఎన్నో రకాల చెట్లు, పక్షులు జంతువులు జీవిస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి నుండి తెలియకుండానే కొన్ని రేణువులు బయటికి వస్తూ ఉంటాయి. ఇవి గాలిలో చేరి ఒక చోట నుంచి ఇంకో చోటికి మారుతూ ఉంటాయి. ఈ సమయంలోనే మనుషుల శరీరం పైన దాడి చేస్తాయి. ముఖ్యంగా ముక్కు, గొంతు చర్మం కళ్ళు వంటి వాటిలో చేరుతాయి. ఇదే అలర్జీ.. 

అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని జంతువుల స్పర్శ దుమ్ముదులి కలిగిస్తాయి. అలాగే కొన్ని రకాల మందులు సైతం అలర్జీని కలిగించే అవకాశం ఉంది. నిత్యం ఎన్నో రకాల పదార్థాలు, కణాలు మనుషుల మీద దాడి చేస్తాయి. వాటిని తట్టుకోగలిగిన రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ సమయంలో మాత్రమే శరీరంలో తేడా గమనించవచ్చు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, శరీరతత్వం సున్నితంగా ఉన్న వారికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఎక్కువగా ఎలర్జీ వస్తుంది. సీజన్ మారే సమయంలో జ్వరం వచ్చి తగ్గిన తర్వాత, గర్భిణీ సమయంలో, శరీరంలో ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ఎలర్జీలు దాడి చేసే అవకాశం ఉంటుంది. చల్లటి ప్రదేశాల్లో బయట ప్రదేశాల్లో ఎక్కువగా తిరిగేవారికి ఎలర్జీ వస్తూ ఉంటుంది.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే..

ముక్కుదిబ్బడగా అనిపించడం, కళ్ళ నుంచి నీరు కారటం, కంటిలో దురద మంట వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారుతూ ఉండటం, ముక్కు లోపల గొంతు లోపల మార్పు కనిపించడం అంటే లక్షణాలు కనిపిస్తాయి.

ఎలా గుర్తించాలంటే..

మొదటగా ఇది మామూలుగా జలుబు అనే అనుకుంటూ ఉంటారు. కానీ తరచుగా వస్తూ ఉంటే మాత్రం సందేహించాల్సిందే తప్పకుండా డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఎలర్జీని కరిగించే పరిసరానికి కొన్ని రకాల పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. మనలోని రక్షణ వ్యవస్థని పెంచుకుంటూ ఉండాలి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఉదయాన్నే తీసుకునే నీటిలో రెండు చిటికెలా పసుపు ఒక చిటికె ఉప్పు వేసుకుని తాగటం వల్ల ఎనర్జీ సమస్యలు తగ్గిపోతాయి.

ఎలర్జీ, ముక్కుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చల్ల పదార్థాలు, పెరుగు వంటివి తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో చన్నీటి స్నానం, తాగడం వంటివి వాటికి దూరంగా ఉండాలి. తమలపాకును నీటిలో మరిగించి ఆ నీటిని ఆవిరి పీల్చడం వల్ల ఎలర్జీ లక్షణాలు తగ్గిపోతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.