Soaked raisins : ఎండుద్రాక్షను నీళ్లలో నానపెట్టుకోని తింటున్నారా..?

Raisins.. దీన్నే కిస్మిస్ అంటారు. దీన్ని తీపి వంటకాల తయారీలో ఎక్కువగా వేస్తుంటారు. ముఖ్యంగా ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Soaked raisins : ఎండుద్రాక్షను నీళ్లలో నానపెట్టుకోని తింటున్నారా..?
Eating raisins soaking them in water


Grapes  తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా black grapes అయితే ఇంకా హెల్తీ.. అయితే  raisins  చాలా తక్కువ మంది తింటారు. వీటివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంచుతాయి. Raisins.. దీన్నే కిస్మిస్ అంటారు. దీన్ని తీపి వంటకాల తయారీలో ఎక్కువగా వేస్తుంటారు. ముఖ్యంగా ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టిన ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో ఇనుము, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో ఉండే రాగి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. పొటాషియం ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

ఎండుద్రాక్షను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.  ఇలా తింటే.. శరీరానికి కావాల్సిన ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఉంటాయి. రోజూ 20 గ్రాముల ఎండుద్రాక్షను తీసుకోవచ్చు. ఇందులో ఉండే అన్ని మూలకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
నానబెట్టిన ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా మలబద్ధకం, అసిడిటీ, అలసట సమస్యల నుండి బయటపడవచ్చు.
ఎండుద్రాక్షలలో విటమిన్ బి కాంప్లెక్స్ తగినంత పరిమాణంలో ఉంటుంది. రక్తహీనత ఉంటే మీరు రోజూ 7-10 ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు.
ఎండుద్రాక్షలలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ద్వారా మన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్ల ఎండుద్రాక్షలను రోజూ తినాలి.
ఎండుద్రాక్షను పాలలో కలిపి తీసుకోవడం వల్ల పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. ఎండుద్రాక్షలలో పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరిచే గుణం ఉంటుందని వెల్లడైంది. ఇది లైంగిక శక్తిని పెంచుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శుక్ర కణాలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అందువల్ల ఎండుద్రాక్షను పాలతో తీసుకోవడం మంచిది. కాబట్టి సమస్య ఉన్నవారు కచ్చితంగా ట్రై చేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.