కొత్తిమీరతో ఫేస్‌ ప్యాక్‌..ఇక మీ అందానికి తిరుగులేదు

కూరలు స్టాటింగ్లో కరివేపాకు క్లైమాక్స్‌లో కొత్తిమీర పడితే ఆ టేస్టే వేరు. కొత్తిమీర ఆహారం రుచిని మరింత పెంచుతుంది. కొత్తిమీర యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే కొత్తిమీర వివిధ చర్మ

కొత్తిమీరతో ఫేస్‌ ప్యాక్‌..ఇక మీ అందానికి తిరుగులేదు


కూరలు స్టాటింగ్లో కరివేపాకు క్లైమాక్స్‌లో కొత్తిమీర పడితే ఆ టేస్టే వేరు. కొత్తిమీర ఆహారం రుచిని మరింత పెంచుతుంది. కొత్తిమీర యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే కొత్తిమీర వివిధ చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీర ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకు ఫేస్ మాస్క్ తయారు చేసి చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మచ్చలు ఉండవు. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ఫేస్‌ ఎలా వేసుకోవాలి.? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..! 
కొన్ని తాజా కొత్తిమీర ఆకులను పేస్ట్‌లా చేయండి. ఒక టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగులో కొత్తిమీర పేస్ట్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.
మీరు చర్మ సంరక్షణ కోసం కొత్తిమీర ఆకు టోనర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టోనర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చర్మం నునుపుగా, మెరుస్తూ ఉంటుంది. కొన్ని కొత్తిమీర ఆకులను నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. నీటిని చల్లబరచండి. స్ప్రే బాటిల్‌లో వడకట్టండి. ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో మీ ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత ఈ టోనర్‌ని ఉపయోగించండి.

కొత్తిమీర కలిపిన నూనె చర్మం, జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకు నూనె చర్మానికి పోషణనిస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఒక కప్పు కొబ్బరి లేదా బాదం నూనెతో కొన్ని కొత్తిమీర ఆకులను 10 నిమిషాలు మరిగించండి. నూనెను చల్లార్చి సీసాలో వడకట్టాలి. కొత్తిమీర ఆకుల నూనెను చర్మంపై మసాజ్ చేయండి. ఫలితం ఉంటుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం తాగితే మంచి ఉపశమనం ఇస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి అన్నీ నయమవుతాయి. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.