శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుందా..? ఈ డ్రింక్‌ తాగండి

కొంతమందికి శరీరం ఎప్పుడు వేడిగా ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా.. ఎప్పుడూ 102 ఫీవర్‌ ఉన్నట్లు కాలుతూనే ఉంటుంది. సడన్‌గా ఎవరైనా పట్టుకుంటే.. అరే ఏంట్రా నీ ఒళ్లు ఇలా కాలుతుంది, జ్వరం

శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుందా..? ఈ డ్రింక్‌ తాగండి


కొంతమందికి శరీరం ఎప్పుడు వేడిగా ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా.. ఎప్పుడూ 102 ఫీవర్‌ ఉన్నట్లు కాలుతూనే ఉంటుంది. సడన్‌గా ఎవరైనా పట్టుకుంటే.. అరే ఏంట్రా నీ ఒళ్లు ఇలా కాలుతుంది, జ్వరం వచ్చిందా ఏంటి అని అడుగుతారు. అలా వేడిగా ఉంటుంది. శరీరం ఎప్పుడు ఇలా వేడిగా ఉంటే..అది ఆరోగ్యం కాదు. ముఖ్యంగా ఇలా బాడీ ఎప్పుడు హీట్‌గా ఉంటే.. పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. స్పెర్మ్‌ అండాశయంలోకి వచ్చేలోపే స్పెర్మ్‌ ఆ వేడికి ఆవిరైపోతుంది. దానివల్ల సంతానోత్పత్తి కష్టం అవుతుంది. వేడిగా ఉంది కదా అని శీతలపానియాలు తాగితే.. అది ఇంకా సమస్య. దంతాలు దెబ్బతిని ఎముక‌ల‌కు సంబంధించిన ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.
The Ultimate Guide To Body Temperature | Basis Blog
ఈ పానీయాల్లో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కెఫిన్, రిఫైండ్ చేసిన పంచ‌దార‌లు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. వీటికి వీలైనంత దూరంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. మ‌న ఇంట్లోనే ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎండ నుంచి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డంతో పాటు త‌క్ష‌ణ శ‌క్తిని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలే త‌ప్ప ఎటువంటి హాని క‌ల‌గ‌దు.
మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేసే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలంటే..క‌ల‌బంద గుజ్జును, తేనెను, నిమ్మ‌ర‌సాన్ని, అల్లం ముక్క‌ల‌ను, రోజ్ యాపిల్‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్‌లో ఒక పెద్ద ముక్క క‌ల‌బంద గుజ్జును తీసుకుని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత ఇందులో ఆరు రోజ్ యాపిల్‌ల‌ను క‌ట్ చేసి వేసుకోవాలి. త‌రువాత ఒక ఇంచు అల్లాన్ని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఈ రెండింటిని కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ జ్యూస్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో త‌గిన‌న్ని చ‌ల్ల‌టి నీళ్ల‌ను పోసుకుని క‌ల‌పాలి. తరువాత రుచికి త‌గినంత తేనె, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన‌ర్జీ డ్రింక్ త‌యార‌వుతుంది. ఇది తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని ఏ వ‌య‌సు వారైనా తీసుకోవ‌చ్చు. మార్కెట్లో దొరికే శీత‌ల పానీయాల‌ను తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డం కంటే ఇలా ఇంట్లోనే ఈ ఎన‌ర్జిటిక్ డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది. దీని వల్ల బాడీ కూల్‌ అవుతుంది. తరచూ తాగడం వల్ల శాశ్వతంగా బాడీలో వేడిని తగ్గించుకోవచ్చు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.