ఉల్లితో ఇలా చేశారంటే.. లైఫ్‌లో జుట్టు రాలే సమస్యే ఉండదు.

జుట్టు ఊడుట కి అనేక కారణాలు ఉండొచ్చు.ఉల్లిపాయ‌ల‌లో ఉండే సల్ఫ‌ర్ జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. అందువ‌ల్ల ఉల్లిపాయ‌ల‌ ర‌సాన్ని ఉప‌యోగిస్తే మంచిది.పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ టిప్స్‌ ఫాలో అవొచ్చు.

ఉల్లితో ఇలా చేశారంటే.. లైఫ్‌లో జుట్టు రాలే సమస్యే ఉండదు.
Prevent hair loss with onions


కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత కొంత సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది. దీంతోపాటు శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిలో ఉండే సల్ఫ‌ర్ జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. అందువ‌ల్ల ఉల్లిపాయ ర‌సాన్ని ఉప‌యోగిస్తే మంచిది.

ఉల్లిపాయ‌ల‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మంలో కొద్దిగా కొబ్బ‌రి నూనెను క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా మసాజ్‌ చేయండి. కొంచెసేపు ఆగి త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. దీనివ‌ల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢంగా మారుతాయి.  
ఉల్లిపాయ‌లను మెత్త‌గా దంచి వాటి నుంచి తీసిన ర‌సంలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లపాలి. ఆ మిశ్ర‌మాన్ని కుదుళ్ల‌కు త‌గిలేలా అప్లై చేయండి.. 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు.
ఉల్లిని పైన చెప్పిన వాటిల్లో మీకు నచ్చిన విధంగా వాడుకోండి. జుట్టు సమస్యను తగ్గించుకోండి. దీంతోపాటు.. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎప్పుడూ తలకు ఆయిల్‌ పెట్టుకోని ఉండకండి.. తలకు ఆయిల్‌ పెట్టడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అనుకుంటారు.. కానీ దీనివల్ల జుట్టుకు చిరాకుగా ఉంటుంది. చుండ్రు సమస్య వస్తుంది. వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేయాలి. ఆయిల్‌ను రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచుకోవద్దు. అంతకన్నా తక్కువే అయినా పర్వాలేదు. స్కల్‌ అనేది క్లీన్‌గా ఉంటేనే..హెయిర్‌ బాగుంటుంది. జుట్టు ఆరోగ్యంగా బాగా పెరగాలంటే పెట్టాల్సింది ఆయిల్‌ కాదు సరైన ఆహారం.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.