చింతగింజలతో ఏళ్ల నాటి కీళ్ల నొప్పులు అయినా పారిపోవాల్సిందే..!!

చింతపండులో చింతగింజలను మీరు చూసే ఉంటారు. వీటిని ఎందుకుపనికిరావు అనుకోని పక్కనే వేస్తారు. అసలు ఔషధం అందులోనే ఉంది తెలుసా..? అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించ‌గ‌ల సత్తా చింత గింజలకు ఉంది తెలుసా..?

చింతగింజలతో ఏళ్ల నాటి కీళ్ల నొప్పులు అయినా పారిపోవాల్సిందే..!!
Tamarind seeds for joint pains


పట్నాల్లో అయితే.. చింతపండును గింజలు లేనిదే తీసుకుంటారు. మళ్లీ ఆ గింజలను తీసుకోవడం ఒక లొల్లి అని. కానీ పల్లెల్లో చింతపండును డైరెక్టుగా చెట్ల నుంచే సేకరిస్తారు.. చాలామంది..చింతచెట్టు ఎక్కి.. చింతచిగురు, చింతకాయలు తీసుకుని.. వాటిని ఇంటికి తీసుకొచ్చివొలిచి..ఎండబెట్టి ఇలా చింతపండును చేసుకుంటారు. చింతపండులో చింతగింజలను మీరు చూసే ఉంటారు. వీటిని ఎందుకుపనికిరావు అనుకోని పక్కనే వేస్తారు. అసలు ఔషధం అందులోనే ఉంది తెలుసా..? అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించ‌గ‌ల సత్తా చింత గింజలకు ఉంది తెలుసా..?

చింతగింజలతో ఏం చేయొచ్చంటే..

చింత‌గింజ‌ల‌ను పెనంపై వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. దీంతో పొట్టు సుల‌భంగా వ‌స్తుంది. పొట్టు తీసిన త‌రువాత లోప‌ల ఉండే ప‌లుకుల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి మ‌ళ్లీ ఎండ‌బెట్టాలి. ఎండిన త‌రువాత వాటిని మ‌ళ్లీ పెనంపై వేసి వేయించాలి. త‌రువాత వాటిని పొడిలా చేయాలి. అనంత‌రం ఆ పొడికి స‌మాన భాగంలో ప‌టిక బెల్లం పొడి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని గాజు సీసాలో నిల్వ చేయండి.

పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవ‌చ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉన్న‌వారు, అడుగు వేయ‌డ‌మే క‌ష్టంగా ఉన్న‌వారు.. రోజుకు 3 సార్లు అయినా తీసుకోవ‌చ్చు. పూట‌కు అర టీస్పూన్ చొప్పున ఈ మిశ్ర‌మాన్ని తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఒక గ్లాస్ తాగాలి. ఇలా చేస్తుంటే కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వ‌స్తుంది. దీంతో కీళ్ల నొప్పులు పోతాయి. మ‌ళ్లీ య‌థావిధిగా న‌డ‌వ‌గ‌లుగుతారు. మంచి ఫలితం ఉంటుంది. చింతగింజలతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు నయం అవుతాయని పరిశోధనలు చేసి మరీ చెప్పారు.
ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మెడ‌, భుజాలు, మోకాళ్లు, న‌డుము, పిక్క‌లు త‌దిత‌ర భాగాల్లో ఉండే ఎముక‌ల్లోని గుజ్జు మ‌ళ్లీ త‌యార‌వుతుంది. దీంతో నొప్పులు త‌గ్గి తిరిగి న‌డ‌వ‌గ‌లుగుతారు. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.
ఇంకెందుకు ఆలస్యం.. రెడీ చేసేయండి.. మార్కెట్లో సపరేట్‌గా చింతగింజలను కూడా అమ్ముతున్నారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు.. వీటికి డిమాండ్‌ ఏ రేంజ్‌లో ఉందో..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.