దంతాలు పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు పేస్టుకు బదులు ఆయుర్వేదం సూచించే ఈ పొడి వాడితే సరి..!

శరీరంలో దంతాలు అనేవి ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దంతాలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనిషి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకొని తన జీవనాన్ని అత్యంత ఆనందంగా గడుపుతాడు. ఇటీవల కాలంలో దంత సమస్యలతో

దంతాలు పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు పేస్టుకు బదులు ఆయుర్వేదం సూచించే ఈ పొడి వాడితే సరి..!


శరీరంలో దంతాలు అనేవి ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దంతాలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనిషి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకొని తన జీవనాన్ని అత్యంత ఆనందంగా గడుపుతాడు. ఇటీవల కాలంలో దంత సమస్యలతో బాధపడేవారు అధికమవుతున్నారు. ఎక్కువ మంది దంత వైద్యున్ని సంప్రదిస్తున్నారు. మనిషి జీవితంలో అవసరమైన ఈ 32 దంతాలను రక్షించుకోవడం అంతా సులభమైన పని కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి తేలిగ్గా గట్టక్కవచ్చు.

మన భారతదేశంలో టూత్ పేస్టులు వాడిన దగ్గర నుండి ప్రజలకు దంతం సమస్యలు అధికమవడం మొదలయ్యాయి. టూత్ పేస్ట్ వాడినప్పుడు దంతాలను శుభ్రం చేసుకోవడం తక్కువ సమయంలో అయిపోతుంది. కానీ వాటి ప్రతికూలమైన సమస్యలు  40 ఏళ్ల తర్వాత మొదలయ్యి జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. టూత్ పేస్ట్ వాడడం వలన దంతాలకు ఉండే బలం తగ్గిపోయి చిగుళ్ల బాపు రావడం దంతాలు త్వరగా పుడిచిపోవడం అలాంటి సమస్యలు సంభవిస్తున్నాయి. 

టూత్ పేస్ట్ కు బదులు అప్పుడప్పుడు పురాతన కాలంలో అవలంబించే పద్ధతులను పాటించటం మంచిది..

సిటీలో ఉన్న వారికి సైతం వ్యాప్ పిల్లలు దొరకడం అంత పెద్ద కష్టమేమీ కాదు వారానికి ఒక్కసారి అయినా ఫేస్ట్ కు బదులు ఈ వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు గట్టిపడటమే కాకుండా నోటిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అవుతుంది.

అలాగే కనీసం 10 రోజులకు ఒకసారి అయినా ఉప్పు, నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని నెమ్మదిగా పళ్ళపై రుద్దుకోవడం వల్ల పళ్ళు పూర్తిగా శుభ్రపడతాయి.

రోజు కచ్చితంగా రెండు పూటలా బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి.

ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రపరుస్తుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం తరిమేయటంలో ముందుంటుంది.

పళ్ళను దంతాలను చెడగొట్టే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా అతి శీతలంగా ఉండే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తినటం తగ్గించాలి.

కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్లపై చారులు ఏర్పడే అవకాశం ఉంది అందుకే వీటిని తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.