ఈ చిట్కా ద్వారా హైబీపీని 20 రోజుల్లో కంట్రోల్‌ చేయొచ్చు..!

హైబీపీని త‌గ్గించి ర‌క్త నాళాల‌ల్లో మార్పులు తీసుకురావ‌డానికి స‌హ‌జ సిద్ధంగా ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఔష‌ధం ఒక‌టి ఉంది. దీనిని మ‌నం వంట‌ల్లో కూడా వాడుతూ ఉంటాం. ఈ ఔష‌ద‌మే Ajwain.

ఈ చిట్కా ద్వారా హైబీపీని 20 రోజుల్లో కంట్రోల్‌ చేయొచ్చు..!
Tips to control high blood pressure


High blood pressure : జీవనశైలి వ్యాధుల్లో..diabetes, BP ముందుంటాయి.. ఎప్పుడైతే..మీ లైఫ్‌స్టైల్‌ స్టైల్‌ మారుతుందో..ఇలాంటి రోగాలన్నీ వస్తాయి..చిన్న వయసులోనే బీపీ రావడం అంటే.. అంత మంచి విషయం కాదు..వీటిని కంట్రోల్లో ఉంచితే..మనకు ఎలాంటి హాని చేయవు.. ఎప్పుడైతే.. ఇవి కంట్రోల్‌ తప్పుతాయో.. మనకు చాలా ప్రమాదం.. మరీ ఎంతటి హైబీపీ అయినా..కేవలం 20 రోజుల్లో కంట్రోల్లోకి రావాలంటే..ఏం చేయాలో తెలుసా..? రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటారేమో..కాదు.. ఆయుర్వేద చిట్కాల ద్వారా దాన్ని కంట్రోల్‌ చేయొచ్చు..ఎలా అంటే.. 

హైబీపీని త‌గ్గించి ర‌క్త నాళాల‌ల్లో మార్పులు తీసుకురావ‌డానికి స‌హ‌జ సిద్ధంగా ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఔష‌ధం ఒక‌టి ఉంది. దీనిని మ‌నం వంట‌ల్లో కూడా వాడుతూ ఉంటాం. ఈ ఔష‌ద‌మే వాము. మ‌నం వామును జ‌లుబూ, ద‌గ్గు, శ‌రీరంలో పేరుకు పోయిన క‌ఫాన్ని తొల‌గించ‌డానికి వాడతాం.. వాము హైబీపీని నియంత్రించ‌డంలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

వాములో థైమాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఈ స‌మ్మేళ‌నం ర‌క్త నాళాల‌లో కాల్షియం చేర‌కుండా స‌హాయప‌డుతుంది. దీని వ‌ల్ల ర‌క్త నాళాలు సున్నితంగా ఉండి ద‌గ్గ‌రికి ముడుచుకు పోకుండా ఉంటాయి. దీని వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్త నాళాల‌ల్లో పేరుకు పోయిన కొవ్వును తొల‌గించ‌డంలో, హైబీపీని, ర‌క్తంలో అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించ‌డంలో వాము నెంబర్‌ వన్‌గా స‌హాయ‌ప‌డుతుంది. వాములో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌, థైమాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ర‌క్త నాళాల‌లో ఉండే కొవ్వును త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఇన్ని విధాలుగా మేలు చేసే వామును ఎలా వాడాలంటే.. 2 గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి ఒక గ్లాసు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఈ నీటిని వ‌డ‌క‌ట్టి వేడి వేడిగా తాగాలి. వాము నీరు చాలా రుచిగా ఉంటుంది. 20 రోజులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. ఈ వాము నీటిని తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు కూడా మంచిదే..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.