Health : స్పెర్మ్‌ కౌంట్‌ పెరగాలంటే.. ముఖ్యంగా బాడీకి ఏ విటమిన్స్‌ కావాలి..?

Health : ఒక జంటకు పిల్లలు కలగడం లేదంటే.. లోపం భార్య భర్త ఇద్దరిలో ఉంటుంది. అయితే ఆడవాళ్లకు చాలా కారణాల వల్ల గర్భం దాల్చడంలో అడ్డంకులు ఏర్పడతాయి.. కానీ మగవారికి కారణాలు తక్కువే ఉంటాయి.. అందులో ప్రధానమైనది.

Health : స్పెర్మ్‌ కౌంట్‌ పెరగాలంటే.. ముఖ్యంగా బాడీకి ఏ విటమిన్స్‌ కావాలి..?


Health : ఒక జంటకు పిల్లలు కలగడం లేదంటే.. లోపం భార్య భర్త ఇద్దరిలో ఉంటుంది. అయితే ఆడవాళ్లకు చాలా కారణాల వల్ల గర్భం దాల్చడంలో అడ్డంకులు ఏర్పడతాయి.. కానీ మగవారికి కారణాలు తక్కువే ఉంటాయి.. అందులో ప్రధానమైనది.. స్పెర్మ్‌ కౌంట్‌.. ఇవి కొన్ని మిలియన్ల కొద్ది ఉన్నా.. బిడ్డ పట్టాలంటే కావాల్సిందే ఒక్కటే.. అవి క్వాలిటీగా లేకపోవడం వల్లే పిల్లలు కలగడం కష్టం అవుతుంది. స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవాడనికి మగవారు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో పాటు.. మీ డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల.. న్యాచురల్గా స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచుకోవచ్చు..!

స్పెర్మ్ కౌంట్ సమస్యతో పిల్లలు లేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే డాక్టర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలతో పాటు మెడిసిన్ కూడా వాడుతుంటారు. ఇలా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 
విటమిన్ సి గల వాటిని తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశాలున్నాయి. అంతేగాక ఇవి స్పెర్మ్ యొక్క నాణ్యతను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  
 
ఇక ప్రతిరోజు విటమిన్ డి తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ గణనీయంగా పెరుగుతుందని..స్పెర్మ్ కౌంట్, నాణ్యత, కదలికను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. 
అలాగే జింక్ కంటెంట్ ఉన్న ఆహరం తీసుకోవడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మగవారి సంతానోత్పత్తిని పెంచడంలో జింక్ ఉపయోగపడుతుంది. గుడ్లలో జింక్ ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, ఫోలిబ్ కూడా స్పెర్మ్ కౌంట్ పెంచడంలో తోడ్పడుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ తో పాటు నాణ్యతను పెంచుతుంది.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి మందులు వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది.. అలా కాకుండా.. నాచురల్‌గా ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రావు.. ఆయుర్వేదంలో ఈ సమస్యను నయం చేసుకోవడానికి ఎన్నో మూలికలు ఉన్నాయి.. వాటిని వాడిన స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.