Over weight : అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గించుకోవాలంటే ఈ ఒక్క డ్రింక్‌ను తాగండి చాలు.. 

Over weight : సరైన విధంగా జాగ్రత్తలు పాటించారంటే.. ఎంత లావు ఉన్న వాళ్లైనా ఈజీగా తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడంతో పాటు.. ఈ డ్రింక్‌ను డైలీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అదేంటో చూద్దామా..!

Over weight : అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గించుకోవాలంటే ఈ ఒక్క డ్రింక్‌ను తాగండి చాలు.. 
Drink to reduce excess weight and belly fat


weight పెరగడం ఎంత కామన్‌ విషయమే.. ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడం అంతే కామన్‌ విషయం.. చాలా మంది బరువు తగ్గించుకోవడం అంతే సింపుల్‌ కాదు అనుకుంటారు.. సరైన విధంగా జాగ్రత్తలు పాటించారంటే.. ఎంత లావు ఉన్న వాళ్లైనా ఈజీగా తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడంతో పాటు.. ఈ డ్రింక్‌ను డైలీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అదేంటో చూద్దామా..!

ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి.. ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వేయాలి. పొట్టుతో స‌హా నిమ్మ‌కాయ‌ను క‌ట్ చేసి ఆ ముక్క‌ల‌ను నీటిలో వేయాలి. అలాగే 4 చిన్న అల్లం ముక్క‌ల‌ను పొట్టుతో స‌హా వేయాలి. 10 పుదీనా ఆకుల‌ను కూడా నీటిలో వేయాలి. ఇప్పుడు ఆ నీటిని బాగా మ‌రిగించండి..

నీరు బాగా మ‌రిగాక స్ట‌వ్ ఆఫ్ చేయండి.. త‌రువాత పాత్ర‌పై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దీంతో ఆ నీరు గోరు వెచ్చ‌గా అవుతుంది. అప్పుడు ఆ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె క‌లిపి తాగేయాలి. ఈ డ్రింక్‌ను ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. ఇలా క‌నీసం 30 రోజుల పాటు చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది. అధిక బ‌రువు ఉన్న‌వారు, పొట్ట దగ్గ‌ర కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ చిట్కాను పాటించ‌వ‌చ్చు. దీంతో త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది.

అల్లం, నిమ్మ‌ర‌సం, తేనెలు అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుదీనా జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది. ఇలా అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఈ చిట్కా వ‌ల్ల త‌గ్గుతాయి. అంతేకాదు, శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు కూడా బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

మీరు పొట్ట తగ్గించుకోవాలనుకుంటే.. ఈ డ్రింక్‌ను ట్రై చేసి చూడండి. ఇప్పటికే చాలా మంది ఈ డ్రింక్‌ తాగి సమస్యను తగ్గించుకున్నారు..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.