ఒత్తిడి కూడా బరువును పెంచుతుందంట...

పనికిరాని ఆహారపు అలవాట్లు, గాడితప్పుతున్న జీవనవిధానాలు....మనిషిని అనారోగ్యాల వైపు నెట్టేస్తున్నాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన ఊబకాయులుగా మార్చేస్తుంది. మితిమీరిన శరీరం ఉంటే ఎంత ప్రమాదమో కొందరికి ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికీ చాలామంది ఎంత తింటున్నారో..ఏం తింటున్నారో పట్టించుకోవడం లేదు. దానివల్ల ఊబకాయం వచ్చేస్తుంది

ఒత్తిడి కూడా బరువును పెంచుతుందంట...


పనికిరాని ఆహారపు అలవాట్లు, గాడితప్పుతున్న జీవనవిధానాలు....మనిషిని అనారోగ్యాల వైపు నెట్టేస్తున్నాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన ఊబకాయులుగా మార్చేస్తుంది. మితిమీరిన శరీరం ఉంటే ఎంత ప్రమాదమో కొందరికి ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికీ చాలామంది ఎంత తింటున్నారో..ఏం తింటున్నారో పట్టించుకోవడం లేదు. దానివల్ల ఊబకాయం వచ్చేస్తుంది. ఊబకాయం అంటే ఒక్క బరువు పెరగడమే కాకుండా......సవాలక్ష అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

ఊబకాయం ప్రభావం ఎక్కువగా పొట్టపైనే ​​కనిపిస్తుంది. పొట్ట పెరిగితే శరీరాకృతి అందవిహీనంగా కనిపిస్తుంది. దానివల్ల మనమీద మనకే ఆత్మవిశ్వాసం కోల్పోతాం. పొట్టపై ఉన్న కొవ్వును చూస్తే అసహ్యంగా కనిపిస్తుంది. ఒక్కోసారి వెంటనే కొవ్వు తగ్గించాలనే కసితో...ఓ రెండు రోజులు డైట్‌లని, వ్యాయామాలని చేసేస్తాం. రెండురోజులయ్యేసరికి మళ్లీ యథా పరిస్థితి. దానివల్ల ఇంకాస్త బరువు పెరిగే అవకాశముంటుంది. కొవ్వును నియంత్రించడానికి..  చాలా మంది ఆహారాన్ని నియంత్రిస్తారు. గంటల తరబడి జిమ్‌లో చెమటలు పట్టిస్తారు. బరువు తగ్గాలంటే వర్కవుట్‌లు, డైట్‌ సరిపోదు.... బరువు పెరగడానికి కారణమెంటో తెలుసుకోవాలి. 

అతి కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే....ముందుగా ఆహారాన్ని నియంత్రించుకోండి. మెటబాలిజం ఊపందుకున్న వ్యక్తులు, వారి ఊబకాయం అదుపులో ఉంటుంది. వృద్ధాప్యం జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న వయస్సుతో జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. కొంతమంది ఎక్కువ తింటారు కానీ....లావు మాత్రం అవ్వరు. ఇంకొంత మంది తక్కువ తిన్నా కూడా కడుపు ఉబ్బరం మొదలవుతుంది. దీనికి కారణం జీవక్రియ. ఒత్తిడి కూడా కొవ్వును పెంచుతుందని మీకు తెలుసా?..నిరంతరం ఒత్తిడికి గురవుతూ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గించలేం. అది గమనించుకోవాలి. ఒత్తిడి సమయంలో మన అడ్రినల్ గ్రంథులు అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. శరీరంలో కొవ్వు పెరగడానికి కార్టిసాల్ అనే హార్మోన్ కూడా కారణమే. బరువు పెరగడానికి ఆహారం మాత్రమే కారణం కాదు. మీ చెడు అలవాట్లు కూడా బాధ్యత వహిస్తాయి. మీరు ఆల్కహాల్ తాగడానికి ఇష్టపడితే.. మీ ఊబకాయం ఎప్పటికీ తగ్గదు. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

కాబట్టి అన్ని విధాలుగా మన మెదడు అలెర్ట్‌లో ఉండాలి. అటు ఆహారం విషయంలోనైనా...అలవాట్ల విషయంలోనైనా మనసును నియంత్రణలో పెట్టుకోవాలి. బరువు పెరిగాక ఆందోళన చెందడం కంటే....ముందే నియమావళి మార్చుకుంటే బెటర్‌. శరీరానికి కావలసిన అవసరమైన పోషక పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. దానితో పాటుగా వ్యాయామం చేయడం, మంచి నిద్ర ఉండటం, ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. కొంత మంది అల్పాహారం స్కిప్‌ చేసేస్తారు. దానికి బదులుగా మొత్తం ఒకేసారి తినేస్తారు. దీని కారణంగా మెటబాలిజం స్లో అయిపోతుంది. కొద్దిరోజులకే బరువు పెరిగిపోతారు. ఒకేసారి తినడం కంటే రోజుకు 4 నుంచి 5 సార్లు కొద్ది కొద్దిగా తింటే ఉత్తమం. 


బొప్పాయి గుజ్జులో శెనగపిండి కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అనంతరం కాసిన్ని నీటిని స్ప్రే చేసి చేతులతో మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా రెండు నిమిషాలు చేసిన అనంతరం చల్లని నీటితో మొత్తం క్లీన్ చేయాలి.

అంతేకాకుండా కోల్‌గేట్‌ టూత్ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు మొటిమలు ఉన్నచోట పెట్టాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో కడగాలి. పెట్టిన వెంటనే ఉపశమనం పొందటమే కాకుండా మొటిమలు కూడా తొలగిపోతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.