థైరాయిడ్‌ సమస్యా? అయితే ఈ ఆహారం తినండి

చాలా మందికి ఈ రోజుల్లో ఉంటున్న సమస్య థైరాయిడ్‌. మీ ఆరోగ్యాన్ని కోరుకునే మీ జీవనవేదంలో....ఈరోజు నిత్యం వేధించే థైరాయిడ్‌ గురించి తెలుసుకుందాం. 2, 3 ఏళ్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఈ థైరాయిడ్‌ సాధిస్తోంది

థైరాయిడ్‌ సమస్యా? అయితే ఈ ఆహారం తినండి


చాలా మందికి ఈ రోజుల్లో ఉంటున్న సమస్య...థైరాయిడ్‌. మీ ఆరోగ్యాన్ని కోరుకునే మీ జీవనవేదంలో....ఈరోజు నిత్యం వేధించే థైరాయిడ్‌ గురించి తెలుసుకుందాం. 2, 3 ఏళ్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఈ థైరాయిడ్‌ సాధిస్తోంది. ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. చాలా మంది థైరాయిడ్‌ టెస్టులు చేయించుకోరు. కాబట్టి అసలు థైరాయిడ్‌ సమస్య లేదనుకుంటారు. చిన్నవాళ్లు గానీ, పెద్దవాళ్లు గానీ థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోండి.

What Are the Early Warning Signs of Thyroid Problems?

1, 2 ఏళ్లకొకసారి చెకప్‌ చేయించుకుంటే...చాలా మంచిది. మనం అలవాటు పడ్డ జీవన విధానం వల్ల శరీరంలో ఉండే గ్రంథులు సరిగ్గా హార్మోన్లు ఉత్పత్తి చేయడం లేదు. అలా కాకుండా ఉండాలంటే గ్రంథులు సక్రమంగా పనిచేయాలంటే మన జీవనశైలి మార్చుకోవాలి. కానీ నేడు మన జీవన విధానం నోటి రుచులకు అనుగుణంగా ఉంది. పనుల్లో బిజీగా ఉండిపోవడం వల్ల దానికి అనుగుణంగా మాత్రమే ఆహారం తింటున్నాం. అది ఎంతవరకూ మంచిది కాదు. మన అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే తింటున్నాం....శరీర అవసరాలను మరిచిపోతున్నాం. అందుకే వయసు రాకుండానే గ్రంథులు పాడైపోతున్నాయి.

ఎన్నో ఏళ్లు హాయిగా ఉండాల్సిన థైరాయిడ్‌ గ్రంథి....చిన్న వయసులోనే ఎందుకు పాడవతుందో ఒకసారైనా ఆలోచించారా? జంతువులకు రాని థైరాయిడ్‌ మనకే ఎందుకు వస్తుందో గ్రహించారా? థైరాయిడ్‌ సమస్య ఒకసారి వస్తే ఇంకా పోదు అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే థైరాయిడ్‌ మందులు వాడితే సమస్య తగ్గుతుంది గానీ....శరీరం మందులకు అలవాటు పడిపోతుంది. ఈ మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండకపోవచ్చు. కానీ ఒక్కో మందు వేసుకోవడం వల్ల మందులకే అలవాటు పడిపోతుంది శరీరం. మనకు ఇష్టమైనవి తింటున్నాం గానీ...శరీరానికి కావాల్సినవి తినడం లేదు. అదే మనం చేసిన పెద్ద తప్పు. కాబట్టి తినే తిండి ముందు ఒకసారి ఏం తింటున్నామన్నది తప్పు ఒప్పులు తెలుసుకోవాలి.

Multiple Choice Question on Thyroid gland hormones, thyroid disorders and  Function test

థైరాయిడ్‌ ఉన్నవాళ్లు మంచి మాంసకృత్తులు ఉన్న ఆహారం తినాలి. అలా చికెన్‌, మటన్‌లు కాదు. మాంసకృత్తులు ఉండే ఫుడ్‌ తీసుకోవాలి. అందుకే చాలా మందికి మాంసకృత్తులు ఉన్న ఆహారం తినకపోవడం వల్ల పౌష్టికాహార లోపం వస్తుంది. ప్రోటీన్‌ ఫుడ్‌ వల్ల హార్మోన్లు తయారవుతాయి. అయితే ఈ థైరాయిడ్‌ ఉండేవాళ్లు కచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

కాబట్టి ఉడికించిన ఆహారానికి దూరంగా ఉండాలి. పొద్దున్నే అన్ని రకాల కూరగాయలు కలిపిన జ్యూస్‌ తాగాలి. టమాట, కీర, క్యారెట్‌, బీట్‌రూట్‌, బీరకాయ, కాసింత నిమ్మరసం, తెనే కలుపుకుని తాగాలి. తొలుత అలవాటు పడాలంటే...టమాట, కీర, క్యారెట్‌, బీట్‌రూట్‌ కలిపిన జ్యూస్‌ తాగాలి. అలవాటు పడ్డాక మిగతా కూరగాయలు కలుపుకోవాలి. పెద్దవాళ్లు కాసింత ఎక్కువతాగినా, చిన్నపిల్లలకు కాస్త చిన్న గ్లాసుడు ఇవ్వాలి, అలా కొంచెం కొంచెం సిప్‌ చేస్తూ తాగాలి. ఆ తర్వాత మొలకలు, ఒక బొప్పాయి పండు గానీ ఏదైనా పండు తినాలి. అలా అవి కడుపు నిండా తినేస్తే ఆకలి వేయదు. సాయంత్రం ఒక జ్యూస్‌ తాగాలి. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా తాగొచ్చు.

రాత్రికి పండ్లతో ముగించాలి. బరువు పెరగాలనుకునేవాళ్లు నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ఇక బరువు కూడా పెరుగుతారు. దానివల్ల థైరాయిడ్‌ లేనివాళ్లు కూడా ఇంక జన్మలో ఈసమస్య రాదు. ఉన్నవాళ్లకు కూడా తగ్గిపోతుంది.

Source By : 

Manthena Satyanarayana Raju

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.