శరీరంలో ఈ అరోగ్య సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు.. మరి అవి ఏంటో తెలుసా!

తల్లి కావటం ప్రతి స్త్రీకి జీవితంలో ఒక వరమనే చెప్పాలి. అయితే ఈ రోజుల్లో మారిపోతున్న జీవన శైలితో శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తినే ఆహారం నుంచి చుట్టూ ఉండే పరిస్థితులు సైతంస్త్రీల హార్మోన్ల పైన

శరీరంలో ఈ అరోగ్య సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు.. మరి అవి ఏంటో తెలుసా!


తల్లి కావటం ప్రతి స్త్రీకి జీవితంలో ఒక వరమనే చెప్పాలి. అయితే ఈ రోజుల్లో మారిపోతున్న జీవన శైలితో శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తినే ఆహారం నుంచి చుట్టూ ఉండే పరిస్థితులు సైతంస్త్రీల హార్మోన్ల పైన ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నిటితో చాలామంది తల్లి అయ్యే భాగ్యాన్ని కోల్పోతున్నారు. అయితే శరీరంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీకి ఆటంకంగా మారుతుందని తెలుస్తుంది అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

స్త్రీలలో ఉండే కొన్ని సమస్యలు ప్రెగ్నెన్సీకి ఆటంకంగా మారుతున్నాయి. అందులో ముఖ్యంగా..

పి సి ఓ ఎస్..

పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్.. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇదే. ఈ సమస్య ఉన్నవారికి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ సైతం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తొందరగానే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే తగిన ఫలితాలు ఉంటాయి.

అండాశయ లోపాలు..

స్త్రీ అండాశయంలో ఏవైనా లోపాలు ఉంటే కచ్చితంగా అవి ప్రెగ్నెన్సీకి ఆటంకంగా మారుతాయి. ముఖ్యంగా వీటిలో ఏవైనా లోపాలు ఉంటే పీరియడ్స్ సమయంలో ఇబ్బందికరంగా ఉండటం, అప్పటికన్నా ఎక్కువగా బ్లీడింగ్ అవడం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ లక్షణాలు కనిపించినవారు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి..

థైరాయిడ్..

థైరాయిడ్ గ్రంధిలో హెచ్చుతగ్గులు ఉంటే థైరాయిడ్ సమస్య వేధిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు అధికంగా బరువు పెరిగిపోవడం లేదా బక్క చిక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారికి విపరీతంగా జుట్టు ఊడిపోవడం, ఎప్పుడు నీరసంగా అనిపించడం వంటివి జరుగుతాయి. వీటితో పాటు పిల్లలు పుట్టడంలో సైతం సమస్యలు ఎదురవుతాయి.

ఎండోమెట్రియాసిస్..

గర్భశయం వెలుపల ఉండే టిష్యులలో ఏవైనా మార్పులు కనిపిస్తే దాన్నే ఎండో మెట్రియాసిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి సైతం పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఊబకాయం..

అధికంగా బరువు ఉండే వారికి సైతం ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు గర్భధారణకు ఆటంకంగా మారుతుంది.

వీటన్నిటితో పాటు మద్యపానం, ధూమపానం, ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం, సరైన జీవన శైలి లేకపోవడం ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీకి ఆటంకాలే.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.