Ear ache : చిన్నపిల్లల్లో చెవి పోటుకి యాంటీబయోటిక్స్ వాడుతున్నారా..! ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

Earache : సాధారణంగా చిన్నపిల్లల్లో చెవి పోటు వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో యాంటీబయోటిక్స్ సరైన చికిత్స కాదు అని ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చెవిపోటు యాంటీ బయాటిక్స్

Ear ache : చిన్నపిల్లల్లో చెవి పోటుకి యాంటీబయోటిక్స్ వాడుతున్నారా..! ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే
Home remedies for Ear ache in children


Earache : సాధారణంగా చిన్నపిల్లల్లో చెవి పోటు వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో యాంటీబయోటిక్స్ సరైన చికిత్స కాదు అని ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చెవిపోటు యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదని అది అంత మంచిది కూడా కాదని తెలుస్తోంది.

చెవి పోటు లాంటి సమస్యలకు తీవ్రమైన యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్నపిల్లల్లో ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుందని, చెవి మధ్యభాగంలో లేదా ఇయర్ డ్రమ్ వెనక ఏదైనా సమస్య వల్ల చెవి నొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని లేదా చెవిలో చీము కారిన పెద్ద భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

సాధారణంగా పిల్లలలో చెవి నొప్పి మూడు రకాలుగా ఉంటుంది..

హఠాత్తుగా చెవ్వు నొప్పి వచ్చి ఏడుస్తూ ఉంటే చీము కరుతుందేమో చూడాలి లేదా మధ్యమధ్యలో చెవి నొప్పి రావడం అనేది ఎదిగే వయసు పిల్లల్లో జరుగుతుంది కానీ కొంతమందిలో మాత్రం చెవిపోటు ఎక్కువ కాలం ఉండి వేధిస్తూ ఉంటుంది.

ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే

చిన్న వయసులో తల్లిదండ్రులకు చెవి నొప్పి వస్తే తర్వాత పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లిపాలు కన్నా సీసా పాలు తాగే పిల్లల్లో చెవి నొప్పి వచ్చిన అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో పొగతాగే అలవాటు ఉన్నవారు ఉన్న చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

సాధారణంగా చెవి మధ్యభాగంలో గాలితో నిండి ఉంటుంది. ఇది ముక్కు వెనుక భాగం నుంచి ప్రయాణించి చెవిలో తడి తేమ లేకుండా చూస్తుంది. అయితే చిన్నపిల్లలు యూట్యూబ్లో చిన్నవిగా సన్నగా ఉండటం వల్ల ముక్క నుండి పీల్చే గాలిలో క్రిములు చెవికి చేరి తేమని కలుగచేస్తాయి. దీనివలన పిల్లలు ఎక్కువగా చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే చెవి నొప్పి వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అల్లం, వెల్లులి, ఉల్లి వంటివి ఆహారంలో ఇవ్వడం వల్ల చెవి నొప్పి తగ్గుతుందని తెలుస్తోంది. అలాగే సీతాఫలం, పెరుగు, అరటిపండు వంటివి ఇస్తూ ఉండాలి. సొంటి కొమ్మును అరగదీసి చెవి వెనక భాగంలో రాస్తే పిల్లల్లో చెవి నొప్పి తగ్గుతుందని తెలుస్తోంది. అయితే మరీ ఎక్కువగా చెవి నొప్పి ఉండి తట్టుకోలేనంత బాధ ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.